Site icon HashtagU Telugu

Megastar: హైదరాబాద్‌లో కీలక షెడ్యూల్‌ కంప్లీట్ చేసుకున్న ‘విశ్వంభర’

Vishwambhara Release Date

Vishwambhara Release Date

Megastar: బింబిసార ఫేం వశిష్ట, మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో ‘విశ్వంభర’ మూవీ వస్తున్న విషయం తెలిసిందే.ఈ చిత్రం టైటిల్ గ్లింప్స్ విడుదలయ్యాక అంచనాలు ఆకాశాన్ని తాకాయి. తాజాగా హైదరాబాద్‌లో ఓ కీలక షెడ్యూల్‌ను చిత్ర బృందం పూర్తి చేసుకుంది. చిరంజీవి, త్రిష కృష్ణన్ తదితరులు షూటింగ్‌లో పాల్గొన్నారు. ఈ షెడ్యూల్‌లో కొన్ని టాకీ పార్ట్స్, పాట, యాక్షన్‌ బ్లాక్‌ని చిత్రీకరించారు. చిరంజీవి నివాసంలో సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణితో సహా మొత్తం బృందంతో పాటు త్రిష కృష్ణన్ కొన్ని ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేశారు. “ఇదొక లెజెండరీ, అద్భుతమైన రోజు! #విశ్వంభర ” అని ఆమె పోస్ట్ చేశారు.

చిరంజీవి, త్రిష, వశిష్ట, కీరవాణి, విక్రమ్, వంశీ, ఛోటా కె నాయుడు, ఎఎస్ ప్రకాష్‌ కనిపిస్తున్న మరో పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు.ఈ మెగా ఫాంటసీ అడ్వెంచర్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ నిర్మిస్తోంది. విక్రమ్, వంశీ, ప్రమోద్ ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రిచ్ ప్రొడక్షన్, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో అద్భుతంగా వుండబోతోంది. .కోటగిరి వెంకటేశ్వరరావు, సంతోష్‌ కామిరెడ్డి ఈ చిత్రానికి ఎడిటర్‌లుగా వ్యవహరిస్తున్నారు. శ్రీ శివశక్తి దత్తా, చంద్రబోస్ లిరిక్ రైట్స్ కాగా, శ్రీనివాస్ గవిరెడ్డి, గంటా శ్రీధర్, నిమ్మగడ్డ శ్రీకాంత్, మయూఖ్ ఆదిత్య స్క్రిప్ట్ అసోసియేట్‌లుగా ఉన్నారు.
విశ్వంభర 2025 సంక్రాంతికి జనవరి 10న విడుదల కానుంది.

Exit mobile version