Site icon HashtagU Telugu

Box Office : ‘విశ్వం’ కలెక్షన్స్.. మైండ్ బ్లోయింగ్ ..!!

Vishwam Movie Collections

Vishwam Movie Collections

శ్రీను వైట్ల – గోపీచంద్ (Srinu Vaitla, Gopichand) కలయికలో వచ్చిన విశ్వం (Vishwam) మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తూ అందర్నీ ఆశ్చర్య పరుస్తుంది. శ్రీను వైట్ల (Srinu Vaitla) ఈ పేరు వినగానే ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ గుర్తుకొస్తాయి. నీకోసం , ఆనందం , సొంతం, వెంకీ , ఢీ, రెడీ , కింగ్ , దూకుడు, దుబాయ్ శ్రీను ఇవన్నీ కూడా ప్రేక్షకుల చేత శభాష్ అనిపించుకున్న సినిమాలే. ఇక దూకుడు సినేమైతే మహేష్ కెరియర్ లోనే ఓ మైలు రాయి చిత్రంగా నిలిచినా మూవీ. అలాంటి సూపర్ హిట్స్ అందించిన శ్రీను వైట్ల..గత కొంతకాలంగా సరైన హిట్ లేదు. దీంతో శ్రీనుకు ఓ హిట్ పడితే బాగుండని సినీ ప్రేక్షకుల తో పాటు సినీ ప్రముఖులు సైతం భావించారు. ఈ తరుణంలో హీరో గోపి చంద్ తో కలిసి విశ్వం మూవీ తెరకెక్కించారు. ఎలాంటి అంచనాలు లేకుండా దసరా కానుకగా ఈ నెల 11 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకోవడమే కాదు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లు (Vishwam Collections) రాబడుతుంది.

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో తెరకెక్కిన ఈ మూవీ లో కావ్య థాపర్ (Kavya Thapar) హీరోయిన్ గా నటించింది. కలెక్షన్ల విషయానికి వస్తే..తొలి రోజు కంటే రెండో రోజు కలెక్షన్స్ బాగున్నాయి. సినిమా బాగుందనీ టాక్ రావడం తో సెకండ్ డే నుండి కలెక్షన్లు పెరగడం స్టార్ట్ అయ్యాయి. అలాగే వరుస సెలవులు కూడా కలెక్షన్లు పెంచడం లో భాగం అయ్యాయి. సెకండ్ డే గోపీచంద్ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.7 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లు అందుకున్నట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. రెండో రోజు నాటికే డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడి 100 శాతం రికవరీ చేసినట్లుగా చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అఫీషియల్‌గా పోస్టర్ రిలీజ్ చేసింది.

ఇక మూడో రోజు విషయానికి వస్తే.. తెలుగు రాష్ట్రాల్లో రూ.2 కోట్లు, హిందీ, కర్ణాటక , రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ కలుపుకుని రూ.4 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించినట్లుగా ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. మొత్తంగా మూడు రోజుల నాటికి విశ్వం ఇండియా వైడ్‌గా రూ.5.75 కోట్ల నికర వసూళ్లను రాబట్టినట్లుగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి ఈరోజు నుండి దసరా సెలవులు పూర్తి అయ్యాయి. మరి ఈరోజు నుండి కలెక్షన్లు ఎలా ఉండబోతాయో చూడాలి.

Read Also : Ola Refund : ఓలా క్యాబ్స్ బుక్ చేస్తారా ? కొత్త మార్పులు తెలుసుకోండి