VishwakSen : ఆహాలో మాస్ కా దాస్.. ఫ్యామిలీ ధమాకా.. యాంకర్ గా మారనున్న హీరో..

త్వరలో విశ్వక్ సేన్ యాంకర్ గా ఆహా ఓటీటీలో సరికొత్త షో రాబోతుంది. 'ఫ్యామిలీ ధమాకా'(Family Dhamaka) అనే సరికొత్త షోని ఆహా అనౌన్స్ చేసింది.

Published By: HashtagU Telugu Desk
Vishwaksen turned as Anchor and Started a show in Aha named Family Dhamaka

Vishwaksen turned as Anchor and Started a show in Aha named Family Dhamaka

యువ హీరో విశ్వక్ సేన్(VishwakSen) ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్నాడు. ఇటీవలే దాస్ కా ధమ్కీ(Das Ka Dhamki) సినిమాతో మంచి విజయం అందుకున్నాడు. ఇప్పుడు విశ్వక్ చేతిలో మరో మూడు సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు ఇంత బిజీగా ఉండి కూడా యాంకర్ గా కొత్త ప్రయాణం మొదలుపెడుతున్నాడు. తెలుగు వారి కోసం వచ్చిన ఓటీటీ ఆహా(Aha) మొదటి నుంచి కూడా కొత్త కొత్త షోలు, సినిమాలు, సిరీస్ లతో మెప్పిస్తునే ఉంది.

త్వరలో విశ్వక్ సేన్ యాంకర్ గా ఆహా ఓటీటీలో సరికొత్త షో రాబోతుంది. ‘ఫ్యామిలీ ధమాకా'(Family Dhamaka) అనే సరికొత్త షోని ఆహా అనౌన్స్ చేసింది. విశ్వక్ యాంకర్ గా పలు ఫ్యామిలీలతో ఒక గేమ్ షో లాంటిది ప్లాన్ చేశారు. మాస్ కా దాస్ ఆడించే ఫ్యామిలీ ఆట చూడండి అంటూ ఆహా ఈ షో గురించి నేడు ప్రకటించింది.

ఇప్పటికే ఫ్యామిలీ ధమాకా కొన్ని ఎపిసోడ్స్ కూడా షూట్ అయిపోయినట్టు సమాచారం. త్వరలోనే ఆహా ఓటీటీలో వీక్లి ఎపిసోడ్స్ కింద ఈ షో వచ్చే అవకాశం ఉంది. ఓ పక్క హీరోగా, డైరెక్టర్ గా మెప్పిస్తున్న విశ్వక్ ఇప్పుడు యాంకర్ గా ఎలా మెప్పిస్తాడా చూడాలి.

 

Also Read : Rana Daggubati : బాలీవుడ్ హీరోయిన్‌కి సారీ చెప్పిన రానా.. మొన్నేమో అలా అనేసి..

  Last Updated: 15 Aug 2023, 09:34 PM IST