Site icon HashtagU Telugu

Vishwak Sen : త్వరలోనే పెళ్లి చేసుకోబోతునన్ విశ్వక్ సేన్.. లవ్ మ్యారేజ్ మాత్రం కాదు..

Vishwak Sen will Do Arrange Marriage in Soon

Vishwak Sen

Vishwak Sen : ఇటీవల అందరూ పెళ్లిళ్లు చాలా లేట్ గా చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇక సినిమా వాళ్ళు అయితే 30 దాటందే పెళ్లి మాటే ఎత్తట్లేదు. ఈ క్రమంలో టాలీవుడ్ బ్యాచిలర్స్ లో ఒకరైన హీరో విశ్వక్ సేన్ తాజాగా తన పెళ్లి గురించి మాట్లాడాడు.

నాని హీరోగా నటించిన హిట్ 3 సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్ లో జరిగింది. ఈ ఈవెంట్ కు రాజమౌళి గెస్ట్ గా వచ్చారు. హిట్ సిరీస్ లోని మొదటి సినిమాలో విశ్వక్ సేన్ నటించిన సంగతి తెలిసిందే. దీంతో విశ్వక్ సేన్ కూడా ఈ ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చాడు. ఈ ఈవెంట్లో విశ్వక్ మాట్లాడిన అనంతరం యాంకర్ సుమ పెళ్లి గురించి అడిగింది.

దీంతో విశ్వక్ సేన్ సమాధానమిస్తూ.. త్వరలోనే పెళ్లి చేసుకుంటాను. మా అమ్మకు పెళ్లి సంబంధాలు చూడమని చెప్పాను అని తెలిపాడు. దీంతో లవ్ మ్యారేజీలు చేసుకుంటున్న ఈ జనరేషన్ లో ఓ హీరో అరేంజ్ మ్యారేజ్ కి చేసుకోబోతున్నాడా అని ఆశ్చర్యపోతున్నారు. మరి ఈ మాస్ కా దాస్ ని పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరో చూడాలి. ఈ ఇయర్ ఎండింగ్ లేదా వచ్చే సంవత్సరంలోనే విశ్వక్ పెళ్లి ఉండొచ్చని తెలుస్తుంది.