Site icon HashtagU Telugu

Vishwak Sen : నాకు 100 కోట్ల కలెక్షన్ కాదు.. 100 కోట్ల రెమ్యునరేషన్ రావాలి.. విశ్వక్ సేన్ కామెంట్స్

Vishwak Sen wants 100 Crores Remunerations Comments goes Viral

Vishwaksen

Vishwak Sen : ఇప్పుడున్న యువ హీరోల్లో ఎంతోకొంత ఫ్యాన్స్, మంచి మార్కెట్ ఉన్న హీరోల్లో విశ్వక్ సేన్ ఒకరు. ఎలాంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చినా ఎన్టీఆర్ ఫ్యాన్ అని చెప్పుకొని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని తనవైపుకు తిప్పుకున్నాడు. మాస్ సినిమాలతో పాటు అపుడప్పుడు ప్రయోగాత్మక సినిమాలు కూడా చేస్తూ హిట్స్ కొడుతున్నాడు.

విశ్వక్సేన్ త్వరలో మెకానిక్ రాకీ అనే సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమా నవంబర్ 22న రిలీజ్ కానుంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నాడు విశ్వక్. తాజాగా విశ్వక్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అందరూ నా సినిమాకు 100 కోట్ల కలెక్షన్స్ రావాలని కోరుకుంటున్నారు. కానీ నాకు 100 కోట్ల రెమ్యునరేషన్ రావాలి అని కోరుకోండి అని అన్నాడు. దీంతో ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

విశ్వక్ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్నాయి. ఫ్యాన్స్ ఆ రేంజ్ కి ఎదగాలని కోరుకుంటున్నాము అని కామెంట్స్ చేస్తుంటే, పలువురు నెటిజన్లు మాత్రం ముందు 100 కోట్ల కలెక్షన్స్ తెచ్చుకో సినిమాకు, ఆశ ఉండొచ్చు కానీ అత్యాశ ఉండొద్దు.. అంటూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. మరి భవిష్యత్తులో 100 కోట్ల కలెక్షన్స్ తన సినిమాకి వస్తాయా, స్టార్ హీరో అయి 100 కోట్ల రెమ్యునరేషన్ విశ్వక్ తీసుకుంటాడా చూడాలి.

Also Read : Mithun Chakraborty : స్టార్ నటుడి పర్స్ కొట్టేసిన దొంగలు.. అడిగినా ఇవ్వలేదు..