Site icon HashtagU Telugu

Vishwak Sen in trouble: మరో వివాదంలో విశ్వక్ సేన్.. యాక్షన్ కింగ్ అర్జున్ ఫైర్!

Vishwak Sen

Vishwak Sen

ఈ మధ్య కాలంలో యువ హీరో విశ్వక్ సేన్ వివాదాలతో పాపులర్ అవుతున్నాడు. ‘ఓరి దేవుడా’ సినిమా విడుదల తర్వాత ఈ నటుడు యాక్షన్ కింగ్ అర్జున్ కూతురుతో సినిమా చేస్తున్నాడు. అర్జున్ కూతురు ఐశ్వర్య అర్జున్ కథానాయికగా నటిస్తోంది. టైటిల్ పెట్టని ఈ ప్రాజెక్ట్ నాలుగు నెలల క్రితమే ప్రకటించి రెండు షెడ్యూల్స్ కూడా పూర్తి చేశారు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ నుండి విశ్వక్ సేన్ తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

సరైన కారణాలు చెప్పకుండా విశ్వక్ సేన్ అగ్రిమెంట్ బ్రేక్ చేసి ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడని ఫిల్మ్ ఇండస్ట్రీలో టాక్స్ వినిపిస్తున్నాయి. ఫిలిం ఛాంబర్‌లో విశ్వక్ సేన్‌పై అర్జున్ సర్జా ఫిర్యాదు చేయనున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పటికే పలు వివాదాలను ఎదుర్కొంటున్న విశ్వక్ సేన్ దీనిపై ఎలా స్పందిస్తాడో మరి.. ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే.

Exit mobile version