Site icon HashtagU Telugu

#BoycottLaila Trend : పృథ్వీరాజ్‌ ఎంతపనిచేసావ్..?

Vishwak Sen On #boycottlail

Vishwak Sen On #boycottlail

యంగ్ హీరో విశ్వక్ సేన్ (Vishwak Sen) నటించిన తాజా చిత్రం ‘లైలా’. మాస్ హీరోగా పేరు దక్కించుకున్న ఈయన తొలిసారి ఇందులో లేడీ పాత్రలో నటించబోతున్నారు. ఫిబ్రవరి 14వ తేదీన విడుదల కాబోతున్న ఈ సినిమాపై అంచనాలు నెలకొని ఉన్నాయి. కాగా ప్రమోషన్ లో భాగంగా ఆదివారం ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తో పాటు డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi) తో పాటూ చిత్ర యంగ్ నిర్మాత సాహు గారపాటి (Sahoo garapati) గెస్ట్లుగా వచ్చారు. ఇకపోతే ఇదే ఈవెంట్లో నటుడు 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ(Prithvi ) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినిమాను వివాదంలోకి నెట్టేశాయి. ఈ సినిమాలో 150 గొర్రెలు ఉండాలని.. కానీ లాస్ట్ సీన్‌లో నా బామ్మర్దులు రాగానే నన్ను రిలీజ్ చేస్తారని , కరెక్ట్‌గా లెక్కేస్తే 11 గొర్రెలే ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు వైసీపీని టార్గెట్ చేసినట్లుగా ఉన్నాయంటూ ఆ పార్టీ శ్రేణులు మండిపడుతున్నాయి. లైలా సినిమాను బాయ్‌కాట్ చేయాలంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున క్యాంపెయినింగ్‌కు దిగారు వైసీపీ శ్రేణులు. దీంతో హీరో విశ్వక్ సేన్ రంగంలోకి దిగి, సినిమాను కష్టపడి చేసాము. దయచేసి మా చిత్రం పై నెగిటివ్ కామెంట్స్ రుద్దకండి అంటూ వేడుకున్నారు.

Chilkur Balaji : రంగరాజన్‌ మీద దాడిపై చినజీయర్ స్వామి రియాక్షన్

” మా ఈవెంట్ లో జరిగిన దానికి మేము క్షమాపణలు చెబుతున్నాము. సినిమాలో ఎవరో ఒకరు తప్పు చేస్తే మిగిలిన వాళ్ళు కూడా తప్పు చేసినట్టేనా.. పృథ్వీ మాట్లాడిన మాటల గురించి మాకు తెలియదు. ఆయన మాట్లాడిన మాటలకు, మా సినిమాకు ఎటువంటి సంబంధం లేదు. పృథ్వీ మాట్లాడిన దానికి సోషల్ మీడియాలో వేల ట్వీట్స్ అంటే ఎలా.. సినిమా బ్రతకాలా? వద్దా..? మేము చిరంజీవి గారిని రిసీవ్ చేసుకోవడానికి బయటకు వెళ్ళినప్పుడు ఆయన మాట్లాడాడు. అది మా కంట్రోల్లో జరగలేదు. సినిమాను చాలా కష్టపడి తీసాము. నేను ఈ వివాదం గురించి ఇంతటితో ముగిస్తున్నాను. మా ప్రమేయం లేని దానికి మమ్మల్ని బలి చేయొద్దు. మా సినిమాను బాయ్కాట్ అంటూ వైరల్ చేయొద్దు” అంటూ విశ్వక్ సేన్ వేడుకున్నారు. మరి ఇప్పటికైనా వైసీపీ శ్రేణులు శాంతిస్తారా..? లేక అలాగే వివాదాన్ని రెచ్చగొడతారా..? అనేది చూడాలి.