Site icon HashtagU Telugu

Gangs of Godavari : సినిమానే రిలీజ్ కాలేదు.. అప్పుడే సీక్వెల్.. పుష్పలా ప్లాన్..!

Vishwak Sen Neha Shetty Gangs Of Godavari Movie Is Coming With Two Parts

Vishwak Sen Neha Shetty Gangs Of Godavari Movie Is Coming With Two Parts

Gangs of Godavari : టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ ప్రస్తుతం వరుస సక్సెస్ లో ఉన్నారు. ఇక ఈ సక్సెస్ ని కంటిన్యూ చేసేందుకు ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమాని ఆడియన్స్ ముందుకు తీసుకు వస్తున్నారు. ఇసుక మాఫియా, రాజకీయ దందాతో పీరియాడిక్ రూరల్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం రూపొందుతున్నట్లు తెలుస్తుంది. ఈ మూవీ టీజర్ ని నిన్న ఈవెంట్ పెట్టి గ్రాండ్ గా రిలీజ్ చేసారు. ఇక ఈ ఈవెంట్ లో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సెకండ్ పార్ట్ గురించి నిర్మాత నాగవంశీ ఆసక్తికర కామెంట్స్ చేసారు.

ఈమధ్య కాలంలో నిర్మాత నాగవంశీ తమ బ్యానర్ తెరకెక్కిన మ్యాడ్, డీజే టిల్లు చిత్రాలకు సీక్వెల్ అనౌన్స్ చేసి ఆడియన్స్ ముందుకు తీసుకు వస్తున్నారు. ఈక్రమంలోనే ఈ సినిమాకి కూడా సీక్వెల్ ని తీసుకు వస్తారా..? అని ప్రశ్నించగా, ఆయన బదులిస్తూ.. “మీరు టైటిల్ లో సరిగ్గా గమనించినట్లు లేరు. టైటిల్ చివరిలో ఐని ఒకటిగా రాశాము. అంటే సీక్వెల్ ఉన్నట్లేగా” అంటూ చెప్పుకొచ్చారు. ఇక ఈ కామెంట్స్ వింటుంటే.. ఈ చిత్రం కూడా పుష్పలా రెండు పార్టులుగా రాబోతుందని తెలుస్తుంది. పుష్పలా అని ఎందుకు అంటున్నాము అంటే.. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరికి, పుష్పకి కొన్ని పోలికలు కనిపిస్తున్నాయి.

రెండు సినిమాల్లో హీరో పాత్ర గ్రే షేడ్స్ తోనే ఉంటాయి. ఇక పుష్పలో ఎర్రచందనం స్మగ్లింగ్ అయితే, దీనిలో ఇసుక స్మగ్లింగ్ అని తెలుస్తుంది. అలాగే రెండిటిలో ఆధిపత్యంతో కూడిన పొలిటికల్ టచ్ కూడా కనిపిస్తుంది. మొదటి భాగంలో హీరో ఎదగడం, ఆ తరువాత తన రూలింగ్ లో జరిగిన యుద్ధంతో రెండు సినిమాలు ఆడియన్స్ ముందుకు రాబోతున్నట్లు తెలుస్తుంది. మరి ఫైనల్ గా థియేటర్స్ లో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఎలా అనిపిస్తుందో చూడాలి. మే 17న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది.

Also read : Bellamkonda Sreenivas: బెల్లంకొండ శ్రీనివాస్ మరోసారి రిస్క్ చేయబోతున్నాడా.. ఎందుకంటే