Site icon HashtagU Telugu

Laila: ఓటీటీలో సందడి చేయబోతున్న లైలా మూవీ.. అధికారికంగా ప్రకటించిన మూవీ మేకర్స్!

Laila

Laila

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్‌సేన్‌ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ లైలా. ఈ సినిమా ఇటీవలే భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి ఊహించని విధంగా డిజాస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే.. ఈ సినిమాలో లేడీ గెటప్ లో కనిపించే అలరించారు విశ్వక్‌సేన్‌. ఈ సినిమా కోసం చాలా కష్టపడినప్పటికీ ఆ కష్టమంతా కూడా వృధా అయిపోయింది. దానికి తోడు లేడీ గెటప్ లు డబుల్ మీనింగ్ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో చాలా రకాల విమర్శలు కూడా వచ్చాయి.

ఆ విమర్శలపై స్పందించిన విశ్వక్‌సేన్‌ క్షమాపణలు తెలిపి ఇకమీదట అలాంటివి లేకుండా జాగ్రత్తలు తీసుకుంటానని అన్నారు. ఇకపోతే థియేటర్లలో విడుదల అయ్యి ప్రేక్షకులను భారీగా నిరాశపరిచిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీడీ ప్లాట్ఫారం ఆహా వేదికగా మార్చి 7 నుంచి అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని ఆహా అధికారికంగా తెలుపుతూ పోస్ట్‌ పెట్టింది. లైలా సినిమాతో ప్రేమలో పడండి అంటూ పోస్టర్‌ షేర్‌ చేసింది. రామ్‌ నారాయణ్‌ దర్శకత్వం వహించిన లైలా లో విశ్వక్‌ సరసన ఆకాంక్ష శర్మ నటించారు.

అయితే థియేటర్లలో ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయిన ఈ సినిమా ఓటీటీలో ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి మరి. ఈ సినిమా కథ ఏమిటి అన్న విషయానికి వస్తే. సోనూ మోడ‌ల్ అలియాస్ సోనూ (విశ్వక్‌ సేన్) ఓల్డ్ సిటీలో బ్యూటీ పార్లర్ న‌డుపుతుంటాడు. అత‌ని మేకప్ స్టైల్‌ చూసి మ‌హిళ‌లు ఎంత‌గానో ఇష్టప‌డుతుంటారు. చిన్నప్పుడే చ‌నిపోయిన త‌న త‌ల్లి నేర్పించిన విద్యతో, ఆమె జ్ఞాప‌కంలా పార్లర్‌ని నిర్వహిస్తుంటాడు. ఎవ‌రికి క‌ష్టం వ‌చ్చినా ఆదుకుంటుంటాడు. అనుకోకుండా ఆయ‌న్ని స‌మ‌స్యలు చుట్టు ముడ‌తాయి. వాటినుంచి గ‌ట్టెక్కాలంటే పారిపోవ‌డ‌మే మార్గం అని స‌ల‌హా ఇస్తారు స్నేహితులు. సోనూ అలా చేయ‌కుండా లైలా అనే అమ్మాయిగా గెట‌ప్ మార్చేస్తాడు. అలా ఎంత‌కాలం త‌ప్పించుకు తిరిగాడు? లైలా అమ్మాయి కాద‌ని సోనూ అని తెలిశాక చోటుచేసుకున్న ప‌రిణామాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే మరి.