Site icon HashtagU Telugu

Vishwak Sen: ఆ ఒక్క విషయం మాత్రం అడగకండి.. హీరో విశ్వక్ సేన్ కామెంట్స్ వైరల్?

Mixcollage 16 Feb 2024 09 21 Am 9359

Mixcollage 16 Feb 2024 09 21 Am 9359

తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. విశ్వక్ సేన్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీబిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే విశ్వక్ సేన్ ప్రస్తుతం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే సినిమాలో నటిస్తూ ఫుల్ బిజీబిజీగా గడుపుతున్నారు. అయితే ఈ సినిమా గత ఏడాది డిసెంబర్ లోనే విడుదల చేయాలి అనుకున్నప్పటికీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా విడుదల తేదిని మారుస్తూ మార్చి 8వ తేదీకి వాయిదా వేశారు.

అయితే ఎట్టకేలకు మార్చి ఎనిమిదో తేదీన ఈ సినిమా విడుదల అవుతుందని అందరూ అభిమానులు ఎంతో అద్భుతంగా ఎదురు చూస్తుండగా తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా విడుదల తేదీన మరొకసారి వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఇకపోతే విశ్వక్ సేన్ నటించిన గామి సినిమా విడుదల చేయబోతున్నట్లు మూవీ మేకర్స్ తాజాగా ప్రకటించారు. అదే తేదీకి వేరే సినిమాను విడుదల చేస్తున్నట్టు తాజాగా ప్రకటిస్తూ ఒక పోస్ట్ ని కూడా షేర్ చేసిన విషయం తెలిసిందే. ఇకపోతే హీరో విశ్వక్ సేన్ నందమూరి ఫ్యామిలీతో అలాగే మెగా ఫ్యామిలీతో చాలా ఫ్రెండ్షిప్ గా ఉంటారు అన్న విషయం మన అందరికీ తెలిసిందే.

ఆ మధ్య విశ్వక్ సేన్ నటించిన ఓరి దేవుడా సినిమా ఫంక్షన్ కి గెస్ట్ గా వెళ్లిన రామ్ చరణ్ ఈ మధ్య కూడా విశ్వక్ ని పర్సనల్ గా కలుసుకున్నారు. దీంతో మెగా ఫ్యాన్స్ నుంచి కూడా విశ్వక్ కి సపోర్ట్ రావడం మొదలయింది. అయితే విశ్వక్ అసలు రామ్ చరణ్ ని ఎందుకు కలిశారు? అనేది చాలామందిలో ప్రశ్నగా మారింది. అయితే ఇదే విషయాన్ని తాజాగా ఒక ఇంటర్వ్యూలో విశ్వక్ సేన్ ని ప్రశ్నించారు. రామ్ చరణ్ ని కూడా రెగ్యులర్ గా కలుసుకుంటున్నారు. ఆయనతో ఏం చర్చలు చేస్తున్నారు? అని ప్రశ్నించగా, విశ్వక్ బదులిస్తూ.. ఏం మాట్లాడుకున్నారు అని ఏ యాక్టర్ ని అడగకండి. ఎవరు నిజం చెప్పరు అంటూ బదులిచ్చారు. ఈ సమాధానంతో చరణ్, విశ్వక్ మీటింగ్ పై మరింత ఆసక్తి కలుగుతుంది. అయితే వీరిద్దరి కాంబినేషన్లో ఏదైనా సినిమా రాబోతోందా? ఆ విషయం గురించి ప్రస్తావించకపోవడం వెనుక ఉన్న రహస్యం ఏమిటి? అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Exit mobile version