Site icon HashtagU Telugu

Vishwak Sen Gangs of Godhavari Trailer : గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ట్రైలర్.. ఇది చరిత్రలో మిగిలిపోవాలంతే..!

Vishwak Sen Gangs Of Godhavari Trailer Talk

Vishwak Sen Gangs Of Godhavari Trailer Talk

Vishwak Sen Gangs of Godhavari Trailer మాస్ కా దాస్ విశ్వక్ సేన్ లీడ్ రోల్ లో కృష్ణ చైతన్య డైరెక్షన్ లో వస్తున్న సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. సితార ఎంటర్టైన్మెంట్, ఫార్చ్యున్ ఫోర్ మూవీస్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి లేటెస్ట్ గా ట్రైలర్ రిలీజ్ చేశారు. 1980 బ్యాక్ డ్రాప్ లో పొలిటికల్ డ్రామాగా వస్తున్న ఈ సినిమా ట్రైలర్ ఇంప్రెస్ చేసింది. విశ్వక్ సేన్ లోని మాస్ యాంగిల్ ని పర్ఫెక్ట్ గా వాడుకునంట్టు అనిపిస్తుంది.

విలేజ్ పాలిటిక్స్ నేపథ్యంతో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి వస్తుంది. సినిమాలో విశ్వక్ సేన్ సరసన నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. అంజలి కూడా ఈ సినిమాలో స్పెషల్ రోల్ చేస్తుంది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచింది. విశ్వక్ సేన్ ఖాతాలో మరో సూపర్ హిట్ సినిమాగా నిలిచేలా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి వస్తుంది.

ట్రైలర్ లో ఇది చరిత్రలో మిగిలిపోవాలంతే అనే డైలాగ్ అదిరిపోయింది. యువ హీరోల్లో విశ్వక్ సేన్ తన మార్క్ సినిమాలతో సత్తా చాటుతున్నాడు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ట్రైలర్ అదరగొట్టగా సినిమా ఎలా ఉంటుందో చూడాలి.