Baby : విశ్వక్ సేన్ కౌంటర్ ఇచ్చింది బేబీ డైరెక్టర్‌ కేనా..?

బేబీ మూవీ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు సాయి రాజేష్

Published By: HashtagU Telugu Desk
vishwak sen counter to baby director

vishwak sen counter to baby director

బేబీ (Baby) మూవీ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు సాయి రాజేష్. ప్రస్తుతం ఇండస్ట్రీ లో సాయి రాజేష్ పేరు చక్కర్లు కొడుతుంది. ఈ సినిమా కంటే ముందు సాయి రాజేష్ హృదయ కాలేయం , కొబ్బరి మట్ట వంటి చిత్రాలు చేసాడు. ఈ సినిమాలు చేసిన డైరెక్టరా..బేబీ సినిమాను డైరెక్ట్ చేసిందని ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం యూత్ ఎలా ఉందనేది ఈ సినిమా ద్వారా చెప్పుకొచ్చారు. గత వారం విడుదలైన ఈ చిత్రం (Baby) బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల పంట కురిపిస్తుంది. అయితే బేబీ చిత్ర కథను ఆనంద్ (Anand Deverakonda) కంటే ముందు మరో హీరోకు చెప్పాలనుకున్నాడట. ఈ విషయాన్నీ సాయి రాజేష్ బేబీ సక్సెస్ మీట్ లో తెలిపాడు.

‘నేను కథను ఓ హీరో వద్దకు చెప్పడానికి వెళ్ళినప్పుడు .. అక్కడ ఆ హీరో.. హృదయ కాలేయం తీసిన దర్శకుడా అంటూ కథ కూడా వినలేదట, అప్పుడు చాలా బాధేసింది’ అని చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని గుర్తుచేసుకుంటూ.. తాను చాలా ఫీల్ అయ్యాయని.. ఆ రోజు రాత్రి కూడా పడుకోలేదని తెలిపాడు. ఈ మాటలు విన్న వారంతా ఆ హీరో ఎవరై ఉంటారని అంత మాట్లాడుకుంటున్నారు.

సరిగ్గా ఇప్పుడు హీరో విశ్వక్ సేన్ ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టాడు. ‘నో అంటే నోనే.. అది మగాడికి కూడా వర్తిస్తుంది. కాబట్టి అరవడం మానేసి.. కూల్ గా ఉందాం. మనమంతా ఇక్కడ శాంతియుత వాతావరణంలో ఉన్నాం. కాబట్టి మనశాంతి, విశ్రాంతి తీసుకోండి’ అంటూ ట్వీట్ చేసాడు. ఈ ట్వీట్ చూసిన వారంతా ఈ ట్వీట్ సాయి రాజేష్ పైనే అని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.

వాస్తవానికి ముందు నుండి కూడా విశ్వక్ సేన్ వివాదాలకు కేరాఫ్ గా నిలుస్తుంటారు. ఆయన నుండి సినిమా వస్తుందంటే అది ఖచ్చితంగా వివాదాల్లో నిలుస్తుంది. ఇక సోషల్ మీడియా లోను విశ్వక్ వివాదాల్లో నిలువడం చాలాసార్లు చూసాం. ఇక ఇప్పుడు ఈ ట్వీట్ తో మరోసారి ఆయన వార్తల్లో నిలుస్తున్నాడు. నిజంగా విశ్వక్ ట్వీట్..సాయి రాజేష్ ఉద్దేశించి చేశాడా..? లేక మరొకరిపైనా..? అనేది క్లారిటీ గా తెలియాల్సి ఉంది.

Read Also : Hyderabad : కాంగ్రెస్ గవర్నమెంట్ లో హైదరాబాద్ లో ట్రాఫిక్ జాం అనేది ఉండదట..బండ్లన్న ట్వీట్

  Last Updated: 21 Jul 2023, 05:50 PM IST