Vishwak Sen: హమ్మయ్య ఎట్టకేలకు విడుదల కాబోతున్న విశ్వక్ సేన్ గామి మూవీ..రిలీజ్ డేట్ ఫిక్స్?

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. హీరో విశ్వక్ సేన్ సినిమాల ద్వారా కంటే ఎక్కువగా కాంట్రవర్సీల ద్వారా బాగ

  • Written By:
  • Publish Date - February 8, 2024 / 11:00 AM IST

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. హీరో విశ్వక్ సేన్ సినిమాల ద్వారా కంటే ఎక్కువగా కాంట్రవర్సీల ద్వారా బాగా పాపులారిటీ సంపాదించున్నాడన్న విషయం తెలిసిందే. అలాగే వరుసగా సినిమాలలో నటించే కూడా అతి తక్కువ సమయంలో భారీగా పాపులారిటీని సంపాదించుకున్నాడు. ఇక తెలుగులో దాస్ కా ధమ్కీ, ఓరి దేవుడా, పాగల్, అశోకవనంలో అర్జున కళ్యాణం, ఫలక్ నుమాదాస్ వంటి సినిమాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకున్నారు విశ్వక్ సేన్. అలాగే సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ సమయంలోనే వరుసగా సినిమాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకున్నారు.

ఇకపోతే తాజాగా విశ్వక్ సేన్ తన అభిమానులకు గుడ్ న్యూస్ ని చెప్పారు. అదేమిటంటే.. విశ్వక్ సేన్ నటించిన గామి సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా చాలా కారణాల వల్ల ఎన్నోసార్లు వాయిదా పడిన విషయం తెలిసిందే. దాదాపు నాలుగు సంవత్సరాల తరువాత ఎట్టకేలకు ఈ సినిమా విడుదలకు సిద్ధమయింది. నాలుగు సంవత్సరాల నిరీక్షణ అనంతరం మార్చి 8న సినిమా రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. విద్యాధర్ డైరెక్షన్‌లో కార్తీక్ శబరీష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. విశ్వక్ సేన్ అఘోరా పాత్రలో కనిపించబోతున్నారు. హిమాలయాలు, వారణశి వంటి ప్రాంతాల్లో సినిమా షూట్ చేసినట్లు సమాచారం. అడ్వెంచరస్ ఫాంటసీ ఫిల్మ్‌గా వస్తున్న ఈ మూవీలో చాందినీ చౌదరి హీరోయిన్ కాగా ఎంజి అభినయ, మహ్మద్ సమద్, దయానంద్ రెడ్డి, హారికా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

అయితే విశ్వక్ సేన్ నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా గత ఏడాది డిసెంబర్ లోనే విడుదల కావాల్సి ఉండగా షూటింగ్ కంప్లీట్ కాకపోవడంతో ఈ సినిమాను మార్చి 8న విడుదల చేస్తామని ప్రకటించారు మూవీ మేకర్స్. కానీ ఇప్పుడు మళ్లీ ఆ సినిమాను వాయిదా వేస్తూ ఆ సినిమా స్థానంలో గామి సినిమాను విడుదల చేస్తున్నారు మూవీ మేకర్స్. మరి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ఎప్పుడు విడుదల అవుతుందో ఏమో చూడాలి మరి. అయితే ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఆ పాటలు సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి. ఈ సినిమా కోసం విశ్వక్సేన్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.