Vishal Vs Udhayanidhi Stalin : తమిళనాడు థియేటర్స్‌ని ఉదయనిధి స్టాలిన్ కంట్రోల్ చేస్తున్నాడా? విశాల్ కామెంట్స్ వైరల్..

ఒకరకంగా చెప్పాలంటే తమిళనాడులో ఇప్పుడు రెడ్ జెయింట్ పిక్చర్స్ భారీ డిస్ట్రిబ్యూషన్ సంస్థ.

  • Written By:
  • Publish Date - April 16, 2024 / 04:00 PM IST

Vishal Vs Udhayanidhi Stalin : తమిళనాడు(Tamilnadu) ముఖ్యమంత్రి తనయుడు ఉదయనిధి స్టాలిన్ గతంలో హీరోగా సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తమిళనాడు మంత్రి వర్గంలో ఉండటంతో సినిమాలు చెయ్యట్లేదు. కానీ రెడ్ జెయింట్ పిక్చర్స్ సంస్థ ద్వారా సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు. ఒకరకంగా చెప్పాలంటే తమిళనాడులో ఇప్పుడు రెడ్ జెయింట్ పిక్చర్స్ భారీ డిస్ట్రిబ్యూషన్ సంస్థ. ఆల్మోస్ట్ స్టార్ హీరోల సినిమాలు, డబ్బింగ్ సినిమాలు అన్ని ఈ సంస్థే రిలీజ్ చేస్తుంది.

అయితే ఉదయనిధి స్టాలిన్ రెడ్ జెయింట్ పిక్చర్స్ ద్వారా థియేటర్స్ అన్ని తన కంట్రోల్ లో పెట్టుకుంటున్నాడని, ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ అవ్వాలో, ఎన్ని థియేటర్స్ లో రిలీజ్ అవ్వాలో కూడా ఆ సంస్థే డిసైడ్ చేస్తుందని విమర్శలు వస్తున్నాయి. అయితే ముఖ్యమంత్రి కొడుకు, ప్రభుత్వం వాళ్ళది అవ్వడంతో కొంతమంది మాట్లాడటానికి భయపడుతున్నారు. కానీ నేడు విశాల్ రెడ్ జెయింట్ పిక్చర్స్ మీద సంచలన వ్యాఖ్యలు చేసాడు.

గతంలో విశాల్ సినిమాలకు థియేటర్స్ దొరక్కుండా రెడ్ జెయింట్ పిక్చర్స్ వ్యవహరించిందని సమాచారం. ఇప్పుడు రాబోయే రత్నం సినిమాకు కూడా ఇబ్బందులు తెస్తున్నారని సమాచారం. దీంతో తాజాగా విశాల్ రత్నం(Rathnam) సినిమా ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవ్వాలి? ఎన్ని థియేటర్స్ లో రిలీజ్ అవ్వాలి అన్ని రెడ్ జెయింట్ పిక్చర్స్ డిసైడ్ చేస్తుంది. మేము కష్టపడి డబ్బులు పెట్టి సినిమాలు తీస్తే వాళ్ళు ఏసీ రూమ్స్ లో కూర్చొని థియేటర్స్ ఓనర్స్ కి ఫోన్లు చేసి సినిమాలు వేయొద్దు అని చెప్తున్నారు. అసలు వాళ్లెవరు అలా చెప్పడానికి? మీకు ఏం హక్కు ఉంది అంటూ ఫైర్ అయ్యారు.

దీంతో విశాల్ చేసిన వ్యాఖ్యలు తమిళ సినీ పరిశ్రమలో సంచలనంగా మారాయి. ఇటీవల విశాల్ విజయ్ పెట్టిన పార్టీకి సపోర్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఉదయ్ నిధి స్టాలిన్ కి వ్యతిరేకంగా మాట్లాడటంతో తర్వాత రాజకీయ పరంగా కుడా శత్రుత్వం వస్తుందని తమిళనాట చర్చలు మొదలు అయ్యాయి.

Also Read : Shankar : దర్శకుడు శంకర్ కూతురి రిసెప్షన్‌లో.. చరణ్, చిరుతో పాటు జాన్వీ కపూర్