Actor Vishal: చంద్రబాబుపై నేను పోటీ చేయట్లేదు.. అవన్నీ పుకార్లే : విశాల్

హీరో విశాల్ వైసీపీ తరుపున.. కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబుపై తలపడనున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈనేపథ్యంలో విశాల్ స్పందించారు.

Published By: HashtagU Telugu Desk
Vishal

Vishal

హీరో విశాల్ వైసీపీ తరుపున.. కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబుపై తలపడనున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈనేపథ్యంలో విశాల్ స్పందించారు. తాను ప్రస్తుతానికి సినిమాలపైనే దృష్టి పెట్టానని తేల్చి చెప్పారు. చంద్రబాబు పై పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. అవన్నీ వదంతులేనని, ఇలాంటి వార్తలు ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నాయో అర్ధం కావడం లేదని వ్యాఖ్యానించారు. ఏపీలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే విషయమై తనను ఎవరు సంప్రదించలేదన్నారు. తనకు ఏపీ రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశమే లేదని పేర్కొన్నారు.తన సన్నిహితులు కూడా ఈ విషయమై అడగటంతో పాటు మీడియాలో ఈ వార్తలు రావడంతో స్పందించాల్సి వచ్చిందని విశాల్ అన్నారు. కాగా, విశాల్ కు తమిళ చిత్ర పరిశ్రమతో పాటు తెలుగు సినీ ఇండస్ట్రీలో  ప్రత్యేక గుర్తింపు ఉంది. దక్షిణ భారత నటీనటుల సంఘమైన “నడిగర్” కు ప్రధాన కార్యదర్శిగా విశాల్ వ్యవహరిస్తున్నారు.

ఏమిటి.. ఎందుకు..?

కుప్పంలో చంద్రబాబుపై బలమైన అభ్యర్థిని జగన్ రెడీ చేశారని.. తమిళ స్టార్ హీరో విశాల్ అక్కడి నుంచి పోటీ చేయబోతున్నారనే ప్రచారం సాగింది. విశాల్ స్వగ్రామం కూడా కుప్పం నియోజకవర్గంలోనే ఉంది. వైఎస్ జగన్ తో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి. కుప్పంలో తమిళ ఓటర్లు భారీగా ఉన్నారు. అందుకే కుప్పంలో విశాల్ ను బరిలోకి దింపి చంద్రబాబుకు చెక్ పెట్టాలని సీఎం జగన్ ప్లాన్ చేస్తున్నారనే వార్త సోషల్ మీడియాలో ఇటీవల వైరల్ అయింది. దీంతో విశాల్ స్పందించి.. దాన్ని ఖండించారు.

  Last Updated: 01 Jul 2022, 10:56 PM IST