చిత్రసీమకు రాజకీయ రంగానికి దగ్గరి సంబంధం ఉన్న సంగతి తెలిసిందే. చిత్రసీమలో రాణించిన చాలామంది రాజకీయాల్లోకి అడుగుపెట్టి సక్సెస్ అయినా వారు ఉన్నారు..అలాగే ప్లాప్ అయినవారు ఉన్నారు. కొంతమంది మాత్రం ఎన్ని అపజయాలు వచ్చిన ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా పెట్టుకొని విజయం సాధించే వరకు కష్టపడ్డారు. అలాంటి వారిలో పవన్ కళ్యాణ్ ను ఉదాహరణ గా చెప్పుకోవచ్చు. తన అన్న ప్రజారాజ్యం పార్టీ పెట్టి మొదటి విడతలోనే విజయం సాధించినప్పటికీ..రాజకీయాల్లో ఎక్కువగా కాలం ఉండలేక..కాంగ్రెస్ లో ప్రజారాజ్యాన్ని విలీనం చేసి, మళ్లీ సినిమాల్లోకి వచ్చారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం సినిమాలు , రాజకీయాలు రెండు చూసుకుంటూ సక్సెస్ అయ్యారు. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇక పవన్ కళ్యాణ్ ను ఉదాహరణ గా తీసుకోని చాలామంది సినీ ప్రముఖులు రాజకీయాల్లోకి రావాలని చూస్తున్నారు. ముఖ్యంగా తమిళనాట వరుసగా హీరోలు తమ రాజకీయ ప్రవేశం గురించి ప్రకటిస్తూ వస్తున్నారు. ఇప్పటికే కమల్ హాసన్ , విజయ్ వంటి వారు రాజకీయాల్లోకి అడుగుపెట్టగా..ఇక విశాల్ కూడా రాజకీయాల్లోకి వచ్చేందుకు సై అంటున్నాడు. తాజాగా ఆయన మాట్లాడుతూ..అన్ని పనులు పక్కన పెట్టేసి రాజకీయాల్లోకి వస్తే బాగుంటుందనిపిస్తోందని… త్వరలోనే రాజకీయాల్లోకి వస్తానని, ప్రజాసేవ చేస్తానని విశాల్ తెలిపారు. విషయం ఏదైనా సరే తాను నిజయతీగా మాట్లాడతానని… తన మాదిరి అందరూ ఉండలేరని చెప్పుకొచ్చారు. తనకు చాలా సింపుల్ గా ఉండటమే ఇష్టమని , ఆడంబరంగా బతకడం తనకు ఇష్టం ఉండదని అన్నారు.
Read Also : AP Employees: ఏపీలో ఉద్యోగుల బదిలీల గడువు పొడిగించిన ప్రభుత్వం