ఢిల్లీ(Delhi) భామ విశాఖ సింగ్(Vishakha Singh) తెలుగులో జ్ఞాపకం అనే ఓ సినిమాతో సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత హిందీ, తమిళ్ సినిమాల్లోనే ఎక్కువగా కనిపించింది. తెలుగులో మధ్యలో నారా రోహిత్(Nara Rohit) రౌడీఫెలో సినిమాలో నటించింది. 2017లో చివరిసారిగా ఓ హిందీ సినిమాలో కనిపించింది విశాఖ. ఆ తర్వాత ఇప్పటివరకు మళ్ళీ సినిమాలు చేయలేదు.
విశాఖ చేతిలో ఓ రెండు హిందీ సినిమాలు ఉన్నా అవి ఇంకా షూటింగ్ దశలోనే ఉన్నాయి. అయితే గత కొన్ని ఏళ్లుగా విశాఖ అనారోగ్య సమస్యలతో బాధపడుతుంది. దానికి చికిత్స కూడా తీసుకుంటుంది. తాజాగా విశాఖ సింగ్ తాను హాస్పిటల్ లో బెడ్ మీద ఉన్న ఫోటోలను షేర్ చేసి ఓ ఎమోషనల్ పోస్ట్ చేసింది.
విశాఖ సింగ్ తాను హాస్పిటల్ లో బెడ్ మీద ఉన్న ఫోటోలను షేర్ చేసి.. నేను కిందపడితే ఎక్కువ సేపు ఉండను జీవితంలో. గత కొన్నాళ్లుగా నాకు శీతాకాలంలో, సమ్మర్ కి ముందు విచిత్ర సంఘటనలు, ప్రమాదాలు జరుగుతున్నాయి, అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. మళ్ళీ వేసవి రాగానే నా ఆరోగ్యం తిరిగి పుంజుకుంటుంది. ఎండాకాలం రాగానే మళ్ళీ నా ఆరోగ్యం కుదుటపడుతుంది. ఇలా ఎందుకు జరుగుతుందో నాకు తెలీదు. కానీ ఏప్రిల్ వస్తే నాకు ఒక కొత్త సంవత్సరం వచ్చినట్టు అనిపిస్తుంది. కొత్త ఆర్ధిక సంవత్సరం ఏప్రిల్ లోనే, నా పుట్టిన రోజు కూడా ఏప్రిల్ లోనే అందుకేనేమో. నేను మరింత ఉత్సాహంగా ఉండాలని అనుకుంటున్నాను అని పోస్ట్ చేసింది. దీంతో విశాఖ అభిమానులు, పలువురు నెటిజన్లు, సెలబ్రిటీలు ఆమె త్వరగా కోలుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు.
Also Read : Vijay Devarakonda : నీకు విశ్రాంతి అవసరం.. సమంతకు స్పెషల్ లెటర్ రాసిన రౌడీ హీరో..