Site icon HashtagU Telugu

Virat kohli and Anushka: అనుష్కతో విరాట్ కోహ్లీ ఫోజులు.. లేటెస్ట్ పిక్స్ వైరల్!

Kohli And Anushka

Kohli And Anushka

బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ, స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఈ జంట నిత్యం వార్తలో ఉంటూ అభిమానులను ఎంటర్ టైన్ చేస్తూనే ఉంటుంది. పార్టీలు, ఫంక్షలు, సినిమా, క్రికెట్ అప్ డేట్స్ గురించి సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ అభిమానులతో టచ్ లో ఉంటుంటారు. తాజాగా ఈ జంట గురువారం జరిగిన ఇండియన్ స్పోర్ట్స్ ఆనర్స్ ఈవెంట్‌కు హాజరయ్యారు. కార్యక్రమానికి వెళ్లే ముందు ఫోటోషూట్ చేసుకున్నారు. అనుష్క స్లిట్‌తో కూడిన పర్పుల్ ఫ్లోర్ లెంగ్త్ గౌనులో, విరాట్ బ్లాక్ సూట్‌లో అందంగా కనిపించాడు. భార్య అనుష్కతో కలిసి కోహ్లీ ఫొటోలకు ఫోజులిచ్చాడు.

అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ తమ ‘డేట్ నైట్’కి బయలుదేరే ముందు కొన్ని ఫోటోలకు పోజులిచ్చారు. ప్రస్తుతం వీరిద్దరి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. లివింగ్ రూమ్ గోడలు అరటి ఆకులు, ఇతర మొక్కలతో రంగురంగుల వాల్‌పేపర్‌తో డిజైన్ చేసి ఉంచబడ్డాయి. అందంగా డిజైన్ చేసిన ఇంటిలో అనుష్క, కోహ్లీ ఫొటోలకు ఫోజులిచ్చి ఆకట్టుకున్నారు. ఈ ఫొటోలను చూసిన ఇరువురి ఫ్యాన్స్ లైక్స్, కామెంట్లతో ప్రశంసలు కురిపిస్తున్నారు. బ్యూటిపుల్ కపుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: Shah Rukh Khan: షాంపూ వాడని షారుక్ ఖాన్.. ఎందుకో తెలుసా!