Site icon HashtagU Telugu

Viral Video : కెన్యాలో రామ్ చరణ్ …వైరల్ వీడియో..!!

Ramcharan

Ramcharan

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ…జపాన్ పర్యటన అనంతరం…కెన్యా వెళ్లారు. అక్కడ ఆఫ్రికా పర్యాటకాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. విదేశాల్లో అందమైన ప్రదేశాలే కాదు…అత్యంత ప్రమాదకరమైన ప్రదేశాల్లోనూ గడుపుతున్నాడు రామ్ చరణ్. ఆఫ్రికాలో సాహసోపేతమైన టూర్ కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కెన్యాలో ఉన్న అరుదైన వన్యప్రాణులను చూస్తూ…జీప్ లో ప్రత్యక్షంగా తిరుగుతున్నారు. వాటికి సంబంధించిన ఫొటోలను తన కెమెరాల్లో బందిస్తున్నాడు. అంతేకాదు ఎడారి ప్రాంతంలో కోడిగుడ్లతో ఆమేట్లు వేస్తున్న వీడియోను షేర్ చేశాడు. ఈ వీడియో చూసిన మెగా అభిమానులు మురిసిపోతున్నారు.