మలయాళ నటుడు, జైలర్ ఫేమ్ వినాయకన్ (Vinayakan) మరోసారి వివాదాస్పదంలో నిలిచారు. మద్యం మత్తులో తన ఇంటి బాల్కనీలో వీరంగం సృష్టించారు. లుంగీ కట్టుకుని బాల్కనీ లో నిలబడి పొరుగింటివారితో గొడవ పడ్డారు. వారిపై పెద్ద పెద్దగా అరుస్తూ, బూతులు తిడుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.
ఇతడు మలయాళ నటుడు అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. 2006 లో వచ్చిన కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) ‘అసాధ్యుడు’ (Asadhyudu) సినిమాలో ఇతను విలన్ గా నటించాడు. ఆ సినిమా పెద్దగా ఆడలేదు. కానీ 2023 ఆగస్టులో వచ్చిన రజినీకాంత్ (Rajinikanth) ‘జైలర్’ (Jailer) సినిమాలో విలన్ గా నటించి పాన్ ఇండియా వైడ్ పాపులర్ అయిపోయాడు. కానీ ఆ పాపులార్టీ ను ఉపయోగించుకోవడంలో ఇతడు విఫలం అవుతూ వస్తున్నాడు. వరుసగా వివాదాల్లో నిలుస్తూ ఆయనకున్న గుర్తింపును చెడగొట్టుకుంటున్నాడు.
Vivek Ramaswamy : ట్రంప్ ‘డోజ్’ నుంచి వివేక్ ఔట్.. పెద్ద స్కెచ్‌తోనే ?
గత ఏడాది సెప్టెంబర్ నెలలో హైదరాబాద్ విమానాశ్రయంలో సీఐఎస్ఎఫ్ సిబ్బందిపై దాడికి పాల్పడ్డాడు. ఆ సమయంలో ఆయన మత్తులో ఉన్నట్లు సమాచారం. గోవాకు వెళ్లేందుకు కనెక్టింగ్ ఫ్లైట్ ఎక్కేందుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. అయితే ఈ ఘటనపై స్పందించిన వినాయకన్.. తాను ఎటువంటి తప్పు చేయలేదని, సీఐఎస్ఎఫ్ అధికారులు తనను ఎయిర్పోర్ట్ లోని ఒక గదిలోకి తీసుకెళ్లి, దాడి చేశారని అన్నారు. ఆ తరువాత అదే ఏడాది ఒక టీ కొట్టు వ్యక్తితో మద్యం మత్తులో గొడవ పడినట్లు సోషల్ మీడియాలో వీడియోలు చక్కర్లు కట్టాయి.
ఇక ఇప్పుడు మరోసారి మద్యం మత్తులో వీరంగం సృష్టించారు. తన ఇంటి బాల్కనీలో లుంగీ కట్టుకొని నిలబడి, పొరుగింటి వారితో గొడవపడ్డారు. ఇక వారిపై అరుస్తూ, బూతులు తిడుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మద్యం తాగిన కారణంగా తూగుతూ.. సరిగ్గా నిలబడలేని పరిస్థితిలో వినాయకన్ కనిపించారు.అయితే ఇలా పక్కింటి వారితో గొడవ పడడానికి గల కారణాలు తెలియదు. కానీ ప్రస్తుతం ఈ విషయం మాత్రం సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతోంది.
మద్యం మత్తులో పొరుగింటి వారిపై అరుస్తూ బూతులు తిట్టిన నటుడు #actorvinayakan #HashtagU pic.twitter.com/8faFr3Ms51
— Hashtag U (@HashtaguIn) January 21, 2025