దేశ వ్యాప్తంగా వినాయకచవితి (vinayaka chavithi) ఉత్సవాలు మొదలయ్యాయి. ఊరు , వాడ, పల్లె , పట్టణం అనే తేడాలు లేకుండా లక్షలాది గణనాథులు కొలువయ్యారు. ఇక సినీ ప్రముఖులు సైతం తమ ఇళ్లలో గణేష్ ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఇంట (Chiranjeevi House) ఈఏడాది ‘కొణిదెల క్లింకారా'(Klin Kaara) రాకతో ఈ ఏడాది వినాయక చవితి పండగ మరింత ఉత్సహం నింపింది. చరణ్ ఉపాసనలకి జూన్ 20న పాప పుట్టిన సంగతి తెలిసిందే. ఈ మెగా ప్రిన్సెస్ క్లింకారా పుట్టినప్పటి నుంచి ఉపాసన వాళ్ల ఇంట్లో ఉంది. ఇక ఇప్పుడు ఉపాసన పాపతో మొదటిసారి చిరంజీవి ఇంట అడుగుపెట్టింది.
Read Also : Tollywood : మరోసారి సందడి చేయబోతున్న ‘హ్యాపీ డేస్’
కుటుంబంతో కలిసి చరణ్, ఉపాసన వినాయక చవితి పండగ చేసుకున్నారు. మొదటి పండగ మానవరాలితో చేసుకోవడం చిరంజీవికి చాలా స్పెషల్ గా నిలిచింది. రామ్ చరణ్ తన హ్యాపినెస్ ని షేర్ చేసుకుంటూ… ‘అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ! ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో జీవితాల్లో విఘ్నాలు తొలగి అందరికీ శుభములు కలగాలని ప్రార్ధిస్తున్నాను! ఈ సారి ప్రత్యేకత … చిన్ని ‘క్లిన్ కారా’ తో కలిసి తొలి వినాయక చవితి జరుపుకోవడం’ అంటూ కోట్ చేసి సోషల్ మీడియాలో ఫోటోస్ పోస్ట్ చేసాడు. ప్రస్తుతం ఈ ఫోటోలని మెగా అభిమానులు వైరల్ చేస్తున్నారు. ఇక వినాయక చవితి పూజలో చిరంజీవితో పాటు తన భార్య సురేఖ, రామ్ చరణ్, ఉపాసనతో పాటు చిరంజీవి కూతుళ్లు, వారి పిల్లలు కూడా పాల్గొన్నారు. మరోవైపు నాగబాబు కూడా తన ఫ్యామిలీతో పండగను సెలబ్రేట్ చేసుకున్నారు. అంతా కలిసి ఇలా పూజ చేయడం, ఫోటోలు షేర్ చేయడం కనులవిందుగా ఉందని మెగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు !
ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో జీవితాల్లో విఘ్నాలు తొలగి అందరికీ శుభములు కలగాలని ప్రార్ధిస్తున్నాను! 🙏
ఈ సారి ప్రత్యేకత … చిన్ని 'క్లిన్ కారా' తో కలిసి తొలి వినాయక చవితి జరుపుకోవడం 😍😊Happy Ganesh Chaturthi to ALL ! Celebrating the… pic.twitter.com/FeaFOtDdhd
— Chiranjeevi Konidela (@KChiruTweets) September 18, 2023