ఇటీవలే ది సబర్మతి రిపోర్ట్ అనే సినిమాతో వచ్చి మరో విజయం సాధించాడు విక్రాంత్ మస్సె. విక్రాంత్ చేతిలో మరో మూడు సినిమాలు ఉన్నాయి. ప్రస్తుతం వరుస హిట్స్ తో ఫుల్ ఫామ్ లో ఉన్న విక్రాంత్ మస్సె సడెన్ గా సినిమాలకు బ్రేక్ ఇస్తున్నట్టు ప్రకటించాడు. తాజాగా తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేసాడు.
విక్రాంత్ మస్సె తన పోస్ట్ లో.. గత కొన్నేళ్లు అద్భుతంగా ఉన్నాయి. నేను నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్తున్నాను. కానీ నేను ప్రస్తుతం ఈ సమయం కుటుంబానికి ఇవ్వాలని రియలైజ్ అయ్యాను. ఒక భర్తగా, ఒక తండ్రిగా, ఒక కొడుకుగా అలాగే ఒక యాక్టర్ గా కూడా. కాబట్టి 2025లో మనం చివరిసారిగా మీట్ అవ్వొచ్చు మళ్ళీ సమయం వచ్చేంతవరకు. నా చివరి రెండు సినిమాలు చాలా జ్ఞాపకాలను ఇచ్చాయి. అందరికి మరోసారి ధన్యవాదాలు. మీకు ఎప్పటికి రుణపడి ఉంటాను అని తెలిపారు.
దీంతో విక్రాంత్ మస్సె చేతిలో ఉన్న మూడు సినిమాలు పూర్తిచేసి సినిమాలకు బ్రేక్ ఇచ్చి కుటుంబంతో గడపబోతున్నాడు అని తెలుస్తుంది. మరి ఈ బ్రేక్ ఎన్నాళ్ళు ఇస్తాడో, ఎన్ని రోజులు సినీ పరిశ్రమకు దూరమవుతాడో అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఆలోచన విరమించుకోవాలని ఫ్యాన్స్, పలువురు సెలబ్రిటీలు కూడా కామెంట్స్ చేస్తున్నారు. మరి కెరీర్ పీక్ లో ఉన్నప్పుడు విక్రాంత్ మస్సె ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడో తనకే తెలియాలి.
Also Read : Ghantasala : ఘంటసాల బయోపిక్.. ఘంటసాలగా నటించేది ఎవరంటే.. రిలీజ్ ఎప్పుడంటే..?