Vikramarkudu : ఆ సీన్ చేస్తున్నప్పుడు రాజమౌళి కట్ చెప్పలేదట.. ఏమైందని రవితేజ వెళ్లి చూస్తే..

మూవీలో ఒక సీన్ తెరకెక్కిస్తునప్పుడు రాజమౌళి అసలు కట్ చెప్పలేదట. ఎంతకీ కట్ చెప్పడం లేదని రవితేజ నటించడం ఆపేసి మానిటర్ దగ్గరకి వెళ్లి రాజమౌళిని చూసి ఆశ్చర్యపోయాడట.

  • Written By:
  • Publish Date - September 26, 2023 / 10:30 PM IST

దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli), మాస్ మహారాజ్ రవితేజ (Raviteja) కాంబినేషన్ లో వచ్చిన యాక్షన్ కామెడీ మూవీ ‘విక్రమార్కుడు'(Vikramarkudu). 2006లో రిలీజ్ అయిన ఈ మూవీ సూపర్ హిట్టుగా నిలిచింది. ఈ సినిమాలోని అత్తిలి సత్తిబాబుగా రవితేజ చేసిన అల్లరి అంతాఇంతా కాదు. బ్రహ్మానందం, రవితేజ కలిసి ఆడియన్స్ ని విపరీతంగా అలరించారు. కాగా ఈ మూవీలో ఒక సీన్ తెరకెక్కిస్తునప్పుడు రాజమౌళి అసలు కట్ చెప్పలేదట. ఎంతకీ కట్ చెప్పడం లేదని రవితేజ నటించడం ఆపేసి మానిటర్ దగ్గరకి వెళ్లి రాజమౌళిని చూసి ఆశ్చర్యపోయాడట.

సినిమాలో రవితేజ, కొందరు ఆడవాళ్లు కొట్టుకొనే సీన్ ఒకటి ఉంటుంది. అది అందరికి గుర్తుకు ఉండే ఉంటుంది. ఈ సీన్ చిత్రీకరిస్తున్న సమయంలో.. రాజమౌళి ఎంత సేపటికి కట్ చెప్పలేదట. ఏంటని రవితేజ వెళ్లి చూడగా.. రాజమౌళి పొట్ట పట్టుకొని విపరీతంగా నవ్వుతూ కనిపించాడట. రాజమౌళి మాత్రమే కాదు, సెట్ లోని కెమెరా మెన్ నుంచి లైట్ మెన్ వరకు ప్రతి ఒక్కరు వాళ్ళు చేసే పని మానేసి థియేటర్ లో ఆడియన్స్ ఎలా ఎంజాయ్ చేస్తారు అలా నవ్వుతూ ఉన్నారట. అది చూసిన రవితేజ ఆశ్చర్యపోవడమే కాకుండా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడట.

స్టోరీ తెలిసిన వాళ్ళు కూడా అంతలా ఎంజాయ్ చేస్తుంటే.. ఒక నటుడిగా తన నటనకి అంతకి మించి కంప్లిమెంట్ మరొకటి ఉండదని రవితేజ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. కాగా ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో.. పలు భాషల్లో కూడా రీమేక్ చేశారు. తమిళంలో కార్తీ, కన్నడలో కిచ్చా సుదీప్, హిందీలో అక్షయ్ కుమార్ రీమేక్ చేసి వాళ్ళు కూడా సూపర్ హిట్స్ అందుకున్నారు. అలాగే ఇండియన్ బెంగాలీ, బంగ్లాదేశ్ బెంగాలీ లాంగ్వేజ్స్ కూడా ఈ చిత్రాన్ని రీమేక్ చేశారు. బంగ్లాదేశ్ లో అయితే రెండుసార్లు రీమేక్ చేశారు.

 

Also Read : Akhil Akkineni : హిట్ కోసం అఖిల్ రాజమౌళి హెల్ప్ తీసుకోబోతున్నాడా?