Vikram Tangalan Postponed : విక్రం తంగలాన్ ఇంకా వెనక్కి..!

Vikram Tangalan Postponed చియాన్ విక్రం తంగలాన్ సినిమా వాయిదా పడిన వార్త మరోసారి ఫ్యాన్స్ కి నిరుత్సాహపరచింది. విక్రం సినిమాలు ఈమధ్య

Published By: HashtagU Telugu Desk
Tangalaan

Tangalaan

Vikram Tangalan Postponed చియాన్ విక్రం తంగలాన్ సినిమా వాయిదా పడిన వార్త మరోసారి ఫ్యాన్స్ కి నిరుత్సాహపరచింది. విక్రం సినిమాలు ఈమధ్య బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాలు అందుకోవట్లేదు. హీరో ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా సరే వర్క్ అవుట్ అవ్వట్లేదు. అయితే చియాన్ విక్రం పా రంజిత్ కాంబో సినిమా అనగానే ఫ్యాన్స్ లో సూపర్ ఎగ్జైట్ మెంట్ మొదలైంది. తనలాన్ అంటూ టైటిల్ పోస్టర్ నుంచే సినిమాపై అంచనాలు పెంచారు. ఇక విక్రం లుక్ అయితే పీక్స్ అనిపించింది. శివపుత్రుడు టైం లో విక్రం ని గుర్తు చేస్తూ పా రంజిత్ ఈసారి విక్రం ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ పెడతాడని భావిస్తున్నారు.

We’re now on WhatsApp : Click to Join

అయితే ఈ సినిమా విషయంలో ఫ్యాన్స్ మరోసారి డిజప్పాయింట్ అయ్యారు. సినిమా రిలీజ్ మళ్లీ వాయిదా పడటం ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చింది. తంగలాన్ సినిమా టీజర్ తో సినిమాపై డబుల్ క్రేజ్ వచ్చేలా చేశారు విక్రం. ఆయన మార్క్ వర్సటాలిటీ రోల్ లో మెప్పించడానికి వస్తున్నారు. అయితే సినిమా అసలైతే డిసెంబర్ రిలీజ్ అనుకున్నారు కానీ అది కుదరలేదు. సంక్రాంతికి రిలీజ్ అన్నారు ఫైనల్ గా జనవరి 26న రిలీజ్ లాక్ చేశారు.

అయితే లేటెస్ట్ గా తనలాన్ ని మరోసారి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్. ఏప్రిల్ లో ఈ సినిమా రిలీజ్ ఉంటుందని ప్రకటించారు. తంగలాన్ సినిమా టీజర్ లో విక్రం విధ్వంసం సినిమాపై తారాస్థాయిలో క్రేజ్ ఏర్పడేలా చేసింది. ఇక ఈ సినిమా తో విక్రం హిట్ ట్రాక్ ఎక్కడం పక్కా అనుకున్నారు. కానీ ఈ సినిమా వాయిదాల మీద వాయిదాలు పడటం ఫ్యాన్స్ ని మళ్లీ కంగారు పడేలా చేస్తుంది.

Also Read : Varalakshmi Sharath Kumar : వరలక్ష్మి శరత్ కుమార్ డిమాండ్ అలా ఉంది.. రెమ్యునరేషన్ షాక్..!

తంగలాన్ సినిమాలో మలయాళ భామ మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటిస్తుంది. సినిమా పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రాబోతుంది. సినిమా అంతా విక్రం విచిత్రమైన గెటప్ తో కనిపించనున్నారు. మరి విక్రం పడిన కష్టానికి తంగలాన్ అయినా న్యాయం చేస్తుంద లేదా అన్నది చూడాలి. తంగలాన్ సినిమాపై ఫ్యాన్స్ లో ఎలాంటి డౌట్స్ ఉన్నా సినిమా వాటిని తీర్చి సూపర్ హిట్ గా నిలుస్తుందని చిత్రయూనిట్ చెబుతున్నారు.

విక్రం కూడా ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాల్సిందే అని గట్టిగా ఫిక్స్ అయ్యారు. విక్రం అనుకున్న రేంజ్ సక్సెస్ ఈ సినిమా అవుతుందా లేదా అన్నది చూడాలి. విక్రం తంగలాన్ సినిమాకు తమిళంతో పాటుగా తెలుగులో కూడా సూపర్ క్రేజ్ ఏర్పడింది.

  Last Updated: 17 Jan 2024, 10:41 AM IST