తమిళ్ స్టార్ హీరో విక్రమ్(Vikram) ఇటీవలే పొన్నియిన్ సెల్వన్(Ponniyin Selvan) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. నెక్స్ట్ విక్రమ్ తంగలాన్(Thangalaan) సినిమాతో రాబోతున్నాడు. పా రంజిత్(Pa Ranjith) దర్శకత్వంలో రా అండ్ రస్టిక్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఆల్రెడీ సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చింది. నిన్ననే తంగలాన్ సినిమా చివరి షెడ్యూల్ షూట్ స్టార్ట్ అయింది. విక్రమ్ కూడా షూట్ లో పాల్గొంటున్నాడు.
ప్రస్తుతం షూటింగ్ షెడ్యూల్ లో యాక్షన్ సీన్స్ తెరకెక్కిస్తున్నారు. అయితే యాక్షన్ సీన్స్ తీస్తున్న నేపథ్యంలో ప్రమాదం జరిగి విక్రమ్ కు పక్కటెముక విరిగింది. ఈ సంఘటన నేడు ఉదయం జరిగింది. దీంతో షూటింగ్ ఆపేసి విక్రమ్ ని హాస్పిటల్ కు తరలించారు. ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉందని వైద్యులు చెప్పినట్టు సమాచారాం. దీనిపై విక్రమ్ మేనేజర్, చిత్రయూనిట్ అధికారికంగా స్పందించి షూటింగ్ లో విక్రమ్ గాయపడ్డారని, పక్కటెముక విరిగిందని, ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారని తెలిపారు.
తంగలాన్ సినిమా కోలార్ బంగారు గనుల కార్మికుల నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కోసం విక్రమ్ ఓ భయంకరమైన రా అండ్ రస్టిక్ లుక్ లోకి మారాడు. ఇటీవలే ఈ సినిమా నుంచి మేకింగ్ వీడియోని కూడా రిలీజ్ చేశారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పూర్తయి వస్తుంది అనుకుంటే విక్రమ్ కి ఇలా జరగడంతో షూటింగ్ ఆగిపోయింది. దీంతో విక్రమ్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. త్వరగా విక్రమ్ కోలుకోవాలని అంతా కోరుకుంటున్నారు.
Also Read : Akhil: ఏజెంట్ సినిమా ఫ్లాప్.. ఒంటరిగా దుబాయ్ కి వెళ్లిపోయిన అఖిల్?