Site icon HashtagU Telugu

Vikram Director: రజనీతో మూవీ అంటే అంత ఈజీ కాదు..!!

Lokesh Imresizer

Lokesh Imresizer

కమల్ హాసన్ కెరియర్లో ఎన్నో విజయాలు…మరెన్నో మైలురాళ్లు. ప్రయోగాల పరంగా ఆయన్ను మించిన నటుడు మరొకరు లేరు. సక్సెస్ పరంగా చూసుకున్నట్లయితే…విక్రమ్ మూవీ ఒక ఎత్తుగా కనిపిస్తుంది. రిలీజైన ప్రతి ప్రాంతంలో ఈ మూవీ మంచి సక్సెస్ ను సొంతం చేసుకుంది. వసూళ్ల పరంగానూ సరికొత్త రికార్డులను క్రియేట్ చేసిన ఈ మూవీకి దర్శకుడు లోకేశ్ కనగరాజ్.

కమల్ హాసన్ కు ఆ స్థాయి సక్సెస్ ఇచ్చిన లోకేశ్…సూపర్ స్టార్ రజనీకాంత్ తో కూడా మూవీ చేయనున్నట్లు గత కొన్నిరోజులుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో…ఈ విషయంపై లోకేష్ స్పందించారు. రజనీ సార్ తో మూవీ అంటే మాటలా….మార్కెట్ పరంగా…క్రేజ్ పరంగా రజనీ సార్ కు తగిన స్టోరీ సిద్ధం చేయడం అంత ఈజీ కాదు అన్నాడు.

రజనీతో మూవీ చేయాలన్నది నా కల. ఆయనతో చేసే సినిమా ఎలా ఉండానే విషయంలో నాకు ఒక క్లారిటీ ఉంది. దానికి తగ్గట్లుగానే ఒక లైన్ను సిద్ధం చేశారు. అది తప్పకుండా రజనీకాంత్ సార్ కు నచ్చుతుందని నేను భావిస్తున్నాను. ఆయనతో తప్పకుండా మూవీ చేస్తానన్న నమ్మకం నాకు ఉందంటూ చెప్పుకొచ్చాడు లోకేశ్.