Site icon HashtagU Telugu

Vikram Collections : బాహుబలి -2 రికార్డు బద్దలుకొట్టిన విక్రమ్…తమిళనాట 150కోట్ల మార్క్…!!

Kamal Hassan

Kamal Hassan

యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ నటించిన మూవీ విక్రమ్. జూన్ 3న రిలీజై బాక్సాఫీస్ వద్ద సెన్సెషన్ క్రియేట్ చేసింది. మొదటిరోజు నుంచే కలెక్షన్ల సునామీ స్రుష్టిస్తూ…ఆల్ టైం రికార్డును క్రియేట్ చేసింది. కమల్ హాసన్ పదేళ్ల తర్వాత నటించిన ఈ మూవీ ఇప్పటికే 300కోట్ల క్లబ్ లో చేరిపోయింది.

ఇప్పుడు తాజాగా తమిళనాట కొత్త రికార్డు క్రియేట్ చేసింది ఈ మూవీ. అత్యధిక వసూళ్లను సాధించి బాహుబలి 2 మూవీ రికార్డును బద్దలుకొట్టింది. అంతేకాదు ఈ ఏడాదిలోనే తమిళనాట అతిపెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా ఈ మూవీ నిలిచింది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 350కోట్లు వసూలు చేసింది. ఒక తమిళనాడులోనే 150కోట్ల మార్కును చేరుకుని బాహుబలి 2 రికార్డును బద్దలు కొట్టింది. బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లను రాబట్టిన మూవీగా ఈ సినిమా నిలిచింది.

డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో తమిళస్టార్ విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ కీలకపాత్రల్లో నటించారు. చివరిలో అతిథిపాత్రలో సూర్య రావడంతో…విక్రమ్ మూవీ మరో లెవల్ కు వెళ్లింది. ఇక చాలా కాలం తర్వాత వెండితెరపై నటవిశ్వరూపం చూపించాడని…కమల్, విజయ్, సూర్య కలిసి చేసిన ఈ మూవీ అదుర్స్ అంటూ నెట్టింట అభిమానులు రచ్చ చేస్తున్నారు.

Exit mobile version