Salman Khan : సల్మాన్ మళ్ళీ హిట్ కొట్టాలంటే రాజమౌళి తండ్రి రావాల్సిందే.. ఆ సినిమా సీక్వెల్ పై క్లారిటీ..

ప్రస్తుతం సల్మాన్ ఖాన్ చేతిలో ఒక్క సినిమా కూడా లేకపోవడం గమనార్హం.

Published By: HashtagU Telugu Desk
Vijayendra Prasad Tells Bajrangi Bhaijaan Sequel Story to Salman Khan

Salman Khan

Salman Khan : బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హిట్ కొట్టి చాలా రోజులు అవుతుంది. గత సినిమాలన్నీ ఏదో యావరేజ్ గా ఆడాయి లేదా ఫ్లాప్ అయ్యాయి తప్ప భారీ హిట్స్ కొట్టి చాలా కాలం అయింది. ఇటీవల వచ్చిన సికందర్ సినిమా కూడా పరాజయం పాలైంది. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ చేతిలో ఒక్క సినిమా కూడా లేకపోవడం గమనార్హం.

ఇలాంటి సమయంలో రాజమౌళి తండ్రి, రచయిత విజయేంద్ర ప్రసాద్ సల్మాన్ ఖాన్ తో మాట్లాడి ఓ కథ చెప్పినట్టు తెలిపాడు. గతంలో 2015 లో విజియేంద్ర ప్రసాద్ ఇచ్చిన కథతో సల్మాన్ ఖాన్ భజరంగి భాయ్ జాన్ అనే సినిమా తీసి పెద్ద హిట్ కొట్టాడు. ఆ సినిమా అప్పట్లో పెద్ద విజయం సాధించింది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. సల్మాన్ ఖాన్ ని కలిసి భజరంగి భాయ్ జాన్ సినిమా సీక్వెల్ కి ఒక లైన్ చెప్పాను. ఆయనకు ఆ కథ నచ్చింది. మరి తీస్తారా లేదా చూడాలి అని చెప్పారు. సల్మాన్ భజరంగి భాయ్ జాన్ సీక్వెల్ తీసే అవకాశం ఉందని తెలుస్తుంది.

వరుస ఫ్లాప్స్ ఉండటం, గతంలో తనకు పెద్ద హిట్ ఇచ్చిన సినిమా సీక్వెల్ కావడం, కథ నచ్చిందని చెప్పడం, ప్రస్తుతం చేతిలో సినిమాలు ఏమి లేకపోవడంతో కచ్చితంగా సల్మాన్ ఈ సినిమా సీక్వెల్ చేస్తాడని బాలీవుడ్ కూడా భావిస్తుంది. దీంతో మరోసారి విజయేంద్ర ప్రసాద్ సల్మాన్ ఖాన్ కి హిట్ ఇస్తాడని అంటున్నారు.

Also Read : Rajamouli: నేను తీయ‌బోయే మ‌హాభార‌తంలో నాని ఫిక్స్‌: రాజ‌మౌళి

  Last Updated: 28 Apr 2025, 10:45 AM IST