చిత్రసీమలో రాజమౌళి తండ్రి విజేంద్రప్రసాద్ (Vijayendra Prasad) గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటివరకు రాజమౌళి (Rajamouli) తెరకెక్కించిన చిత్రాలన్నిటికి విజేంద్రప్రసాద్ కథ అందిస్తూ కొడుకు విజయం లో కీలక భాగస్వామి అవుతున్నాడు. అలాంటి విజేంద్రప్రసాద్ సాయం తీసుకునేందుకు డైరెక్టర్ పూరి సిద్ధం అయ్యినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం పూరి (Director Puri) సినీ కెరియర్ ఏమాత్రం బాగాలేదు. ఇస్మార్ట్ శంకర్ తో మళ్లీ ఫామ్ లోకి వచ్చినట్లే అనిపించినా ఆ తర్వాత తెరకెక్కించిన లైగర్, ఇస్మార్ట్ శంకర్ 2 చిత్రాలు భారీ డిజాస్టర్లు అయ్యాయి. ఈ క్రమంలో విజయేంద్ర ప్రసాద్ను పూరి కలవడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
Nara Lokesh : ప్రజలు తిరస్కరించినా వాళ్ల తీరు మారలేదు : మంత్రి లోకేశ్
గతంలో ‘డబుల్ ఇస్మార్ట్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పూరి మాట్లాడుతూ “లైగర్” తర్వాత విజయేంద్ర ప్రసాద్ తనకు కాల్ చేసి, తదుపరి కథను ముందే చెప్పమని కోరిన విషయాన్ని వెల్లడించారు. కానీ అప్పట్లో పూరి స్టోరీ చెప్పేందుకు ముందుకు వెళ్లకపోవడం, ఆ సినిమా డిజాస్టర్ కావడం అభిమానుల్లో చర్చకు దారి తీసింది. ఇదంతా గుర్తు పెట్టుకున్న పూరి, ఇప్పుడు విజయేంద్ర ప్రసాద్‌ను కలవడం ద్వారా ఆయన అనుభవాన్ని, సలహాలను వినడం ప్రారంభించాడని తెలుస్తుంది.
పూరి ప్రస్తుతం విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కించబోయే ప్యాన్ ఇండియా మూవీపై దృష్టి పెట్టాడు. ఈ సినిమాలో కథ అభివృద్ధిలో విజయేంద్ర ప్రసాద్ సలహాలు ఇచ్చారని సమాచారం. గతంలో ‘టెంపర్’ కథలో వక్కంతం వంశీ సహకరించినట్టే, ఇప్పుడు ఈ కథకు విజయేంద్ర ప్రసాద్ కీలక మార్గదర్శకుడయ్యారని తెలుస్తోంది. ఈ సినిమాకి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే విలన్‌గా దునియా విజయ్, కీలక పాత్రల్లో టబు, నివేదా థామస్ వంటి స్టార్ క్యాస్టింగ్‌లో చేరగా, రాధికా ఆప్టే మాత్రం ప్రాజెక్టులో లేనని స్పష్టం చేశారు. ఈ నెలలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుండగా, చిత్రాన్ని ఈ ఏడాది చివర్లో విడుదల చేయాలని పూరి టార్గెట్ పెట్టుకున్నాడు.
Read Also : HHVM : సమయం లేదు ట్రైలర్ లేదు…ఏంటి వీరమల్లు ఈ ఆలస్యం