Site icon HashtagU Telugu

Baahubali : బాహుబలి కథని రాయడం రచయిత విజయేంద్ర ప్రసాద్‌.. ఎలా మొదలు పెట్టారో తెలుసా..!

Vijayendra Prasad How To Built Up Prabhas Baahubali Story

Vijayendra Prasad How To Built Up Prabhas Baahubali Story

Baahubali : బాహుబలి సినిమా గురించి తెలుగు ఆడియన్స్ కి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టాలీవుడ్ సినిమా పరిశ్రమనే కాదు ఇండియన్ సినిమా రూపురేఖల్ని కూడా మార్చేసిన చిత్రం. రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాలో ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క, సత్యరాజ్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇక ఈ సినిమాకి విజయేంద్ర ప్రసాద్‌ కథని అందించారు. ఇంతకీ అసలు ఈ కథని రాయడం విజయేంద్ర ప్రసాద్‌ ఎలా మొదలు పెట్టారో తెలుసా..?

ఈ విషయాన్ని ఓ సందర్భంలో విజయేంద్ర ప్రసాద్‌ చెప్పుకొచ్చారు. ఒకసారి రాజమౌళి తన దగ్గరకి వచ్చి.. “స్త్రీ, పురుష పాత్రలని సమానంగా చూపిస్తూ, ఇద్దరికీ ఒకే ప్రాధాన్యత ఉండే యాక్షన్‌ డ్రామా ఏమైనా ఉందా..?” అని అడిగారట. అప్పుడు ఆయన దగ్గర ఆ కథ లేదు. కానీ ఆ సమయంలో రాజమౌళికి కొన్ని సన్నివేశాలు చెప్పారట.

ఆ సన్నివేశాలు ఏంటంటే.. ఒక విదేశీయుడు భారతదేశానికి వస్తాడు. అలా వచ్చిన విదేశీయుడు.. యువకులకు కత్తిసాము శిక్షణ ఇస్తున్న ఒక వృద్ధుడిని చూస్తాడు. అతడే అత్యుత్తమ ఖడ్గ వీరుడు అయిన కట్టప్ప. అతడితో విదేశీయుడు మాట్లాడుతున్న సమయంలో.. బాహుబలి గురించి కట్టప్ప చెబుతాడు. బాహుబలి చేతిలో కత్తి ఉన్నంతకాలం ఎవరు తనని ఓడించలేరని చెబుతాడు. అది విన్న ఆ విదేశీయుడు బాహుబలిని చూడాలని చెబుతాడు.

దానికి కట్టప్ప బదులిస్తూ.. బాహుబలిని తానే వెన్నుపోటు పొడిచి చంపినట్లు చెబుతాడు. అలా సినిమా కథ స్టార్ట్ అవుతుందని చెప్పారట. అలాగే ఒక తల్లి ఒక పసిబిడ్డని పట్టుకొని నదిలో మునిగిపోతూ కూడా.. ఆ బిడ్డని కాపాడడం కోసం ప్రాణం బిగబెట్టుకొని ఉంటుందని చెప్పారట. ఆ సన్నివేశమే బాహుబలి ఓపెనింగ్ షాట్ అయ్యింది. ఇలా ఈ రెండు సన్నివేశాలు చెప్పిన తరువాత.. ఒక్కో పాత్రని అల్లుకుంటూ మొత్తం కథని సిద్ధం చేసుకున్నారట. ఈ స్క్రిప్ట్ పూర్తి చేయడానికి నాలుగైదు నెలలు పట్టిందట.

Also read : RRR : ఐపీఎల్‌లో నాటు నాటు మ్యానియా.. రాజస్థాన్ రాయల్స్ టీం డాన్స్ వీడియో వైరల్..