Tollywood Industry Head : చిరంజీవే టాలీవుడ్ పెద్ద.. స్టార్ రైటర్ కామెంట్స్..!

Tollywood Industry Head దాసరి నారాయణ రావు తర్వాత తెలుగు చలన చిత్ర పరిశ్రమ పెద్ద ఎవరన్నది సమాధానం లేని ప్రశ్నగా ఉంది. కొందరు చిరంజీవే ఇండస్ట్రీ పెద్ద అంటున్నా

Published By: HashtagU Telugu Desk
Vijayendra Prasad About Chiranjeevi Tollywood Industry Head

Vijayendra Prasad About Chiranjeevi Tollywood Industry Head

Tollywood Industry Head దాసరి నారాయణ రావు తర్వాత తెలుగు చలన చిత్ర పరిశ్రమ పెద్ద ఎవరన్నది సమాధానం లేని ప్రశ్నగా ఉంది. కొందరు చిరంజీవే ఇండస్ట్రీ పెద్ద అంటున్నా దాన్ని కొందరు యాక్సెప్ట్ చేయట్లేదు. అయితే రాజమౌళి ఫాదర్, స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ మాత్రం టాలీవుడ్ పెద్ద చిరంజీవి అని చెబుతున్నారు.

We’re now on WhatsApp : Click to Join

అయోధ్య బాల రాముడి విగ్రహ ప్రతిష్ట కోసం చిరంజీవికి ఆహ్వానం అందింది. అయితే టాలీవుడ్ తరపున చిరంజీవి పెద్ద అనే ఉద్దేశంతోనే ఆ ఇన్విటేషన్ ఇచ్చారని విజయేంద్ర ప్రసాద్ అన్నారు.

రాజమౌళి తీసే ప్రతి సినిమాకు తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తుంటారు. ఆర్.ఆర్.ఆర్ తర్వాత మహేష్ తో సినిమా చేస్తున్నారు జక్కన్న. ఈ సినిమా కథ పూర్తైందని మహేష్ రేంజ్ పెంచేలా సినిమా ఉంటుందని అన్నారు విజయేంద్ర ప్రసాద్. అయితే ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ అంటే టాలీవుడ్ లోనే కాదు పాన్ ఇండియా లో కూడా ఒక క్రేజ్ ఉంది. మరి రాజమౌళి సినిమాతో దాన్ని పెంచుతామని అంటున్నారు విజయేంద్ర ప్రసాద్.

సినిమా ఫారెస్ట్ అడ్వెంచర్ కథతో వస్తుందని అంటున్నారు. సినిమా కోసం మహేష్ తన లుక్ స్టైల్ అంతా మార్చనున్నాడు. ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లబోతుందని తెలుస్తుంది. మహేష్ రాజమౌళి సినిమాను కె.ఎల్ నారాయణ అత్యంత భారీ బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నారు.

Also Read : Mily Beauty Tamannah : ఆ క్రేజీ సీక్వెల్ లో మిల్కీ బ్యూటీ.. ఆ డైరెక్టర్ కోసమే చేస్తుందా..?

  Last Updated: 23 Jan 2024, 05:12 PM IST