Site icon HashtagU Telugu

Chiranjeevi : చిరంజీవి సినిమాలో నటించేందుకు.. నో చెప్పిన విజయశాంతి.. కారణం అదే..

Vijayashanti Said No To Chiranjeevi Vishwambhara Movie Offer

Vijayashanti Said No To Chiranjeevi Vishwambhara Movie Offer

Chiranjeevi : వెండితెర పై మెగాస్టార్ చిరంజీవికి జోడిగా కనిపించి, ఆడియన్స్ గుండెల్లో బెస్ట్ జోడిగా.. ఒక సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న కాంబినేషన్ హీరోయిన్స్ లో ఒకరు విజయశాంతి. దాదాపు 19 సినిమాల్లో చిరు, విజయశాంతి కలిసి నటించారు. చిరంజీవి మాస్ ఇమేజ్ ని మ్యాచ్ చేస్తూ విజయశాంతి యాక్టింగ్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకునేది. వీరిద్దరి డాన్స్ నెంబర్స్ కి కూడా ఆడియన్స్ లో మంచి ఫాలోయింగ్ ఉంది.

అయితే ‘మెకానిక్‌ అల్లుడు’ సినిమా తరువాత చిరంజీవి, విజయశాంతి కాంబినేషన్ మళ్ళీ స్క్రీన్ పై కనిపించలేదు. ఇక ఆ తరువాత విజయశాంతి నటించడం మానేయడంతో.. ఇప్పటివరకు మళ్ళీ ఈ ఇద్దర్ని కలిసి చూడలేదు. అయితే మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా ఫంక్షన్ లో చాలా కాలం తరువాత చిరంజీవి, విజయశాంతి ఒకే వేదిక పై కనిపించి ఆడియన్స్ ని ఆకట్టుకున్నారు. సరిలేరు నీకెవ్వరు మూవీతో విజయశాంతి రీ ఎంట్రీ ఇవ్వడంతో.. త్వరలోనే మళ్ళీ చిరు, విజయశాంతి కాంబినేషన్ చూస్తాము అనుకున్నారు అభిమానులంతా.

కానీ విజయశాంతి మళ్ళీ నటించలేదు అని ఆ సినిమా సమయంలోనే చెప్పేసి.. ఫ్యాన్స్ ఆశల మీద నీళ్లు చల్లారు. అయితే తాజాగా ‘విశ్వంభర’ సినిమాలోని ఓ ముఖ్య పాత్ర కోసం చిరు టీం.. విజయశాంతిని సంప్రదించారట. కానీ ఆ ఆఫర్ ని విజయశాంతి సున్నితంగా తిరస్కరించారట. “ప్రేక్షకుల మదిలో మా జోడి.. హీరోహీరోయిన్స్ గా చెరగని ముద్ర వేసుకుంది. ఇప్పుడు ఈ సినిమాలో చిరంజీవి పక్కన మరో పాత్రలో నటించి.. ఆ ముద్రని నేను చెరపాలని అనుకోవడం లేదు. కాబట్టి ఈ ఆఫర్ ని నేను కాదు అనాల్సి వస్తుంది. అర్ధం చేసుకోండి” అంటూ సున్నితంగా తిరస్కరించారట.

చిరు టీం కూడా విజయశాంతి మాటలకు కన్విన్స్ అయ్యారట. మరి ఇప్పుడు ఆ ముఖ్య పాత్ర కోసం ఇంకే నటిని సంప్రదిస్తారో చూడాలి. కాగా సోషియో ఫాంటసీ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వశిష్ఠ డైరెక్ట్ చేస్తున్నారు.

Also read : Ranveer Singh : ‘హనుమాన్’ దర్శకుడు ప్రశాంత్ వర్మతో రణ్‌వీర్ సింగ్ సినిమా.. నిజమేనా..?