టాలీవుడ్ యువ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ఇండస్ట్రీలో ఉన్న వారసులకు (స్టార్ కిడ్స్) కథ నచ్చకపోతే తేలిగ్గా “నో” చెప్పే స్వేచ్ఛ ఉండగా, తనలాంటి అవుట్‌సైడర్‌కు ఆ అవకాశం దక్కాలంటే చాలా సంవత్సరాలు కష్టపడాల్సి వచ్చిందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం తాను కూడా కథ నచ్చకపోతే ధైర్యంగా తిరస్కరించే స్థితికి వచ్చానంటూ పేర్కొన్నారు. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. విజయ్ ఇప్పుడు “సింపతి కార్డు” ఆడుతున్నారని విమర్శిస్తున్నారు.
CM Revanth Challenges KCR : ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లోనే చర్చ పెడదాం – రేవంత్ రెడ్డి ప్రకటన
విజయ్ దేవరకొండ “బ్యాక్ గ్రౌండ్ లేని హీరో”గా తనను ప్రొజెక్ట్ చేసుకోవడం పట్ల కొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆయన తండ్రి గోవర్ధన్ రావు స్వయంగా టీవీ ఇండస్ట్రీలో పనిచేసిన వ్యక్తి అని, ‘పెళ్లిచూపులు’ నిర్మాతల్లో ఒకరైన యష్ రంగినేని ఆయన మామ వరస వ్యక్తి అని మాట్లాడుకుంటున్నారు. దీంతో విజయ్‌కు బ్యాక్ గ్రౌండ్ లేదు అనే ప్రచారం నిజం కాదని అంటున్నారు. గీతా ఆర్ట్స్, వైజయంతి మూవీస్, మైత్రి మూవీ మేకర్స్, దిల్ రాజు లాంటి పెద్ద నిర్మాణ సంస్థలలో ఆయనకు వరుస అవకాశాలు వచ్చాయని, ఈ క్రెడిట్ ఆయన్ను బలమైన నేపథ్యం ఉన్న హీరోగా చూపుతోందని అంటున్నారు.
అంతేకాకుండా విజయ్ దేవరకొండ ఫ్లాప్‌ల మధ్యలో ఈవిధమైన వ్యాఖ్యలు చేయడం వల్ల ఇది తాను కొంచెం తక్కువగా మిగిలిపోయానని చూపించే ప్రయత్నం అని కొంతమంది విమర్శిస్తున్నారు. ‘లైగర్’ వంటి భారీ ప్లాప్ తర్వాత ‘జనగణమన’, ‘హీరో’ వంటి ప్రాజెక్టులు క్యాన్సిల్ కావడం, ప్రస్తుతం ‘కింగ్ డమ్’తో తిరిగి హిట్ కొట్టాలని ట్రై చేస్తున్న తరుణంలో ఇలాంటి వ్యాఖ్యలతో జనాల్లో కాస్త సింపతీ తెచ్చుకోవాలని చూస్తున్నట్లు అర్ధం అవుతుంది.