Vijaya Nirmala : విజయ్ నిర్మల తన ఆస్తుల్లో.. సగం నరేష్‌కి.. మరో సగం ఇంకో హీరోకి..?

విజయ్ నిర్మల వారసుడు అంటే నరేష్ మాత్రమే. విజయ్ నిర్మల దర్శకురాలిగా, నటిగా ఎన్నో కోట్ల ఆస్తిని సంపాదించారు. ఆ మొత్తాన్ని నరేష్‌కే ఇచ్చారా..?

Published By: HashtagU Telugu Desk
Vijaya Nirmala Properties shared to two Heros

Vijaya Nirmala Properties shared to two Heros

తెలుగు సినీ పరిశ్రమలో నటిగా, దర్శకురాలిగా, నిర్మాతగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకున్న నటి ‘విజయనిర్మల'(Vijaya Nirmala). మహిళా దర్శకురాలిగా 44 సినిమాలను తెరకెక్కించి గిన్నిస్ బుక్ అఫ్ రికార్డును సొంతం చేసుకున్న ఘనత ఆమెది. ఆమె 2019లో మరణించి ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. కాగా ఈమె రెండుసార్లు వివాహం చేసుకున్నారు. మొదటి పెళ్లి అయిన తరువాత సీనియర్ హీరో ‘నరేష్’కి(Naresh) జన్మనిచ్చారు. ఆ తరువాత సూపర్ స్టార్ కృష్ణ(Krishna)ని పెళ్లి చేసుకున్నారు.

అయితే విజయ్ నిర్మల వారసుడు అంటే నరేష్ మాత్రమే. విజయ్ నిర్మల దర్శకురాలిగా, నటిగా ఎన్నో కోట్ల ఆస్తిని సంపాదించారు. ఆ మొత్తాన్ని నరేష్‌కే ఇచ్చారా..? అనే ప్రశ్నకు జవాబు.. ఆమె ఆస్తి పంపకాలు చేద్దామనుకున్నప్పుడు నరేష్ తో పాటు మరో హీరోకి కూడా ఆస్తిలో సగభాగం ఇద్దామనుకున్నారట. ఇంతకీ ఆ హీరో ఎవరని ఆలోచిస్తున్నారా..? అతను ఎవరో కాదు నరేష్ పెద్ద కొడుకు ‘నవీన్’. ఇతను కూడా రెండు సినిమాల్లో నటించి హీరోగా ఆడియన్స్ కి పరిచయం అయ్యాడు.

విజయ్ నిర్మల ఆస్తి పంచుదాం అనుకున్నప్పుడు సగభాగం నరేష్ కి, సగభాగం నవీన్ కి రాయాలని అనుకున్నారట. అయితే నవీన్ కి ఆస్తులు పై అంత అవగాహన లేకపోవడంతో మొత్తం తన తండ్రి నరేష్ పేరు మీదనే రాయమని చెప్పడంతో.. విజయ్ నిర్మల ఆస్తిని మొత్తం నరేష్ పేరు పై రాశారు. ఈ విషయాన్ని నవీన్ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం నరేష్ ఆస్తుల విలువ సుమారు రూ.1000 కోట్ల వరకు ఉంటుందని సమాచారం.

కాగా నరేష్ కి ముగ్గురు కొడుకులు ఉన్నారు. మొదటి భార్య కొడుకు నవీన్. రెండో భార్య కొడుకు రణవీర్. మూడో భార్య కొడుకు తేజ. ఇక నరేష్ ఆస్తుల విషయంలో ఈ ముగ్గురు కొడుకులు మధ్య ఎప్పుడు చర్చ రాలేదని, ముగ్గురికి ఒకరంటే ఒకరు చాలా ఇష్టమని నవీన్ చెప్పుకొచ్చాడు.

 

Also Read : 2018 Movie : ఇండియా నుంచి అధికారిక ఆస్కార్ ఎంట్రీ సాధించిన మలయాళీ సూపర్ హిట్ సినిమా..

  Last Updated: 27 Sep 2023, 09:31 PM IST