Site icon HashtagU Telugu

Vijay Vs Ajith: విజయ్ వర్సెస్ అజిత్.. కోలీవుడ్ లో స్టార్ వార్!

Kollywood

Kollywood

క్రికెట్ (Cricket) లో నెంబర్ వన్ ర్యాంకు ఉన్నట్టు.. సినిమాల్లోనూ నెంబర్ గేమ్ పై డిస్కషన్ కొనసాగుతూనే ఉంటుంది. ఇక ఫ్యాన్స్ కూడా తమ హీరోనే గ్రేట్ అంటూ సోషల్ మీడియాలో యుద్ధాలు చేసిన ఘటనలున్నాయి. ఈ నేపథ్యంలో కోలీవుడ్ (Kollywood)లో ఫ్యాన్స్ వార్ కొంచెం ఎక్కువే. అయితే తమిళ్ సూపర్ స్టార్ రజినీకాంత్ దశాబ్దాల తరబడి టాప్ స్టార్ గా కొనసాగాడు. ఆ తర్వాత ఎంతోమంది హీరోలు రేసులోకి వచ్చారు. అయితే అజిత్ కుమార్ (Ajith Kumar) తెగింపు, తలపతి విజయ్ (Thalapathi Vijay) వారసుడు సినిమాలు 2023 సంక్రాంతి బరిలో రిలీజ్ కానున్నాయి. ఇప్పటికే దిల్ రాజు ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. తమిళంలో అజిత్ కంటే విజయ్ పెద్ద స్టార్ అంటూ కామెంట్స్ చేశాడు. దీంతో ఆయన కామెంట్స్ వైరల్ అయ్యాయి.

తాజాగా నెంబర్ గేమ్ పై త్రిష (Trisha) కృష్ణన్ కామెంట్స్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ బ్యూటీ మాట్లాడుతూ “నేను వ్యక్తిగతంగా నంబర్స్ గేమ్‌ను నమ్మను. ఎవరి సినిమా బాగా ఆడుతుందో, ప్రేక్షకులను ఎవరి సినిమా ఎంటర్ టైన్ చేస్తుందో ఆ సినిమానే నెంబర్ వన్’’ అంటూ చెప్పింది. తాను తలపతి విజయ్, అజిత్ కుమార్ ఇద్దరి హీరోలతో పనిచేశాను. నా ద్రుష్టిలో ఇద్దరూ గ్రేట్ హీరోలే. నేను సినీ కెరీర్ ప్రారంభించముందే నుంచే ఈ ఇద్దరూ స్టార్స్ గా ఉన్నారు. వారికి ఫ్యాన్ క్లబ్‌లు ఉన్నాయి. ఎవరు పెద్దవారో నేను ఎలా చెప్పగలను’’ అని అంటోంది త్రిష (Trisha).

విజయ్ కే దిల్ రాజు ఓటు

ఇటీవల ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దిల్ రాజు (Dil raju) మాట్లాడుతూ.. ప్రస్తుతం తమిళనాడులో హీరో అజిత్ కుమార్ కంటే విజయ్ పెద్ద స్టార్ అని అన్నారు. అందుకే వరిసు సినిమా కోసం మరిన్ని స్క్రీన్స్ కేటాయించాల్సిందిగా.. ఉదయనిధి స్టాలిన్ ను అభ్యర్థించేందుకు ఆయన చెన్నై(Kollywood) కూడా వెళ్లారు. దీంతో దిల్ రాజ్ వ్యాఖ్యలపై అజిత్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. వాస్తవానికి చాలా కాలంగా తమిళనాడు (Kollywood)లో విజయ్, అజిత్ ఫ్యాన్స్ మధ్య వార్ జరుగుతుంటుంది. గతంలో వీరిద్దరి సినిమాలు ఒకేసారి విడుదల కావడం అప్పట్లో థియేటర్ల వద్ద పెద్ద యుద్ధమే జరిగేది. ఇక ఇప్పుడు చాలా సంవత్సరాల తర్వాత వీరిద్దరి సినిమాలు సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద పోటీ పడనున్నాయి.

Also Read: Girls In Google: కొత్త పెళ్లికూతుళ్లు గూగుల్ లో ఏం సెర్చ్ చేస్తున్నారో తెలుసా!

Exit mobile version