Indraja Shankar: ఆ డైరెక్టర్ ను పెళ్లి చేసుకున్న విజిల్ సినిమా నటి.. ఫోటోస్ వైరల్?

  • Written By:
  • Publish Date - March 25, 2024 / 01:00 PM IST

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి నటించిన విజిల్ సినిమా గురించి మనందరికీ తెలిసిందే. విజిల్ సినిమా పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చేది అందులో కామెడీ టైమింగ్. ఈ సినిమాలో హీరో విజయ్ అలాగే ఇంద్రజ శంకర్ మధ్య కామెడీ టైమింగ్స్ అదుర్స్ అని చెప్పవచ్చు. విజయ్ ఫుట్ బాల్ టీమ్ లో ఉన్న అమ్మాయిలలో పాండియమ్మ పాత్రలో నవ్వించింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో కనిపించింది. ఇంద్రజ శంకర్ తమిళ్ నటుడు రోబో శంకర్ కుమార్తె అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె వయసు 20 సంవత్సరాలు.

ఇన్నాళ్లు సినిమాల్లో తనదైన కామెడీతో అలరించిన ఇంద్రజ శంకర్ ఇప్పుడు వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. తాజాగా మార్చి 24న తన స్నేహితుడు డైరెక్టర్ కార్తీక్‏ను వివాహం చేసుకుంది. ఆదివారం చెన్నైలో జరిగిన వీరి వివాహనికి ఇరు కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు, సన్నిహితులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. వీరి పెళ్లి ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. దేవుడి ఆశీస్సుతల్లతో పెద్ద సమక్షంలో మనం ఒక్కటయ్యాం అంటూ పెళ్లి ఫోటోలను నెట్టింట షేర్ చేసింది ఇంద్రజ శంకర్.

ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా ఇంద్రజ, కార్తీక్ చాలా కాలంగా ప్రేమలో ఉన్నారు. గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఇంద్రజ తన ప్రేమ విషయాన్ని బయటపెట్టింది. అమ్మా నాన్న కంటే ఎక్కువగా తనకు ఎల్లప్పుడు సపోర్ట్ చేసే వ్యక్తి కార్తీక్ అని అతడు మామన్ ట్రస్ట్ కూడా నడుపుతున్నాడని అందులో నలభై మంది అనాథ పిల్లలకు చదువు చెప్పిస్తున్నాడని తెలిపింది. ముందుగా తనే ప్రపోజ్ చేశానని ఆ తర్వాత నాలుగు నెలలకు కార్తీక్ తన ప్రేమను అంగీకరించారని చెప్పుకొచ్చింది. ఆ తర్వాత వారంలోనే ఇంట్లో చెప్పి తమ పెళ్లిని ఖాయం చేసుకున్నామని తెలిపింది.