96 Movie Re Release : వాలెంటైన్స్ డే ఆ సూపర్ హిట్ సినిమా రీ రిలీజ్..!

96 Movie Re Release కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ 96 ని రీ రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. విలక్షణ నటుడు విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించిన ఈ సినిమాను ప్రేమ్ కుమార్ డైరెక్ట్

Published By: HashtagU Telugu Desk
Vijay Sethupathi Trisha 96 Movie Re Release On Valentine Day

Vijay Sethupathi Trisha 96 Movie Re Release On Valentine Day

96 Movie Re Release కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ 96 ని రీ రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. విలక్షణ నటుడు విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించిన ఈ సినిమాను ప్రేమ్ కుమార్ డైరెక్ట్ చేశారు. 2018 లో వచ్చిన ఈ సినిమా యూత్ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది. కొన్నాళ్ల కెరీర్ గ్యాప్ తర్వాత త్రిష కు ఈ సినిమా ద్వారానే సూపర్ హిట్ దక్కింది. అంతేకాదు విజయ్ సేతుపతి ఖాతాలో కూడా ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

ఈ సినిమాకు గోవింద్ వసంత్ అందించిన మ్యూజిక్ సినిమాకు ప్రాణంగా నిలిచింది. సినిమాలో కథ కథనాలు ఎంత ఇంపాక్ట్ కలిగించాయో వాటికి డబుల్ ఇంపాక్ట్ గోవింద్ వసంత్ అందించిన మ్యూజిక్ ఇంపాక్ట్ కలిగించింది. ఈ సినిమాకు ఇప్పటికీ చాలా మంది లవర్స్ ఉండగా వాలెంటైన్స్ డే కి ఈ సినిమాను రీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.

ఇదే సినిమాను తెలుగులో జాను గా రీమేక్ చేశారు. అయితే తెలుగులో సినిమా జస్ట్ ఓకే అనిపించుకుంది. అయితే అప్పటికే తమిళ 96 సినిమాను తెలుగు ఆడియన్స్ చాలామంది చూడటం వల్ల జాను సినిమా అంత ఆశించిన ఫలితం దక్కించుకోలేదు. ఏది ఏమైనా వాలెంటైన్స్ డేకి మరోసారి 96 రీ రిలీజ్ అవ్వడం కోలీవుడ్ ఆడియన్స్ పండుగ చేసుకుంటున్నారు.

ఇక తెలుగులో మాత్రం తొలిప్రేమ, బేబీ, ఓయ్ ఇలా చాలా సినిమాలు రీ రిలీజ్ ప్లాన్ చేశారు. ప్రేమికుల రోజు తెలుగు ఆడియన్స్ కి అన్ని లవ్ స్టోరీ సినిమాస్ రీ రిలీజ్ చేసి మరోసారి ఆడియన్స్ ని మెప్పించాలని చూస్తున్నారు.

Also Read : Rashmi Gautham : కుర్చి మడతపెట్టి.. ఈ వార్తలను నమ్మొద్దంటున్న జబర్దస్త్ యాంకర్..!

  Last Updated: 13 Feb 2024, 06:35 PM IST