Vijay Sethupathi : మక్కల్ సెల్వన్ కి కథలు నచ్చట్లేదా..?

Vijay Sethupathi తెలుగులో సినిమాలు చేయాలని ఉన్నా సరైన కథలు రావట్లేదని అన్నారు. కథ విషయంలో అసలేమాత్రం కాంప్రమైజ్ అవ్వని విజయ్ సేతుపతికి మన మేకర్స్ అతనికి నచ్చిన కథ అందించలేకపోతున్నారు.

Published By: HashtagU Telugu Desk
Vijay Sethupathi Telugu Movie News

Vijay Sethupathi Telugu Movie News

కోలీవుడ్ స్టార్ హీరో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి త్వరలో విడుదల 2 తో రాబోతున్నారు. వెట్రిమారన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ సేతుపతితో పాటు మంజు వారియర్ కూడా నటించింది. ఈమధ్యనే ఆమె వేటయ్యన్ లో నటించి మెప్పించారు.

విడుదల 2 సినిమా మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాను తెలుగులో కూడా భారీగా రిలీజ్ చేస్తున్నారు. ఐతే ఈ సినిమా రిలీజ్ ప్రమోషన్స్ లో విజయ్ సేతుపతి (Vijay Sethupathi)కి తెలుగు సినిమాలు ఎందుకు చేయట్లేదు అన్న ప్రశ్న ఎదురైంది.

కథ విషయంలో అసలేమాత్రం..

ఐతే తనకు తెలుగులో సినిమాలు చేయాలని ఉన్నా సరైన కథలు రావట్లేదని అన్నారు. కథ విషయంలో అసలేమాత్రం కాంప్రమైజ్ అవ్వని విజయ్ సేతుపతికి మన మేకర్స్ అతనికి నచ్చిన కథ అందించలేకపోతున్నారు. ఈ విషయంలో విజయ్ సేతుపతి ఫ్యాన్స్ కాస్త డిజప్పాయింటెడ్ గా ఉన్నారు. విజయ్ సేతుపతి తెలుగులో ఉప్పెన సినిమా చేశారు. ఆ సినిమా మంచి సక్సెస్ అయ్యింది.

ఆ తర్వాత అలాంటి పాత్రలే చాలా వచ్చినా ఆయన చేయలేదు. ఈమధ్యలో విజయ్ సేతుపతి చేసిన మహారాజ సినిమా ఇక్కడ మంచి సక్సెస్ అయ్యింది. విడుదల 2 (Vidudala 2) మీద విజయ్ సేతుపతి చాలా నమ్మకంగా ఉన్నారు. మరి సినిమా ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకుంటుందా లేదా అన్నది చూడాలి. వెట్రిమారన్ (Vetrimaran) నుంచి సినిమా వస్తుంది అంటే ఆడియన్స్ అంతా ఈగర్ గా ఎదురుచూస్తారు. విజయ్ సేతుపతి తో విడుదల 2 సినిమా పై అటు తమిళ్ లో భారీ క్రేజ్ ఉండగా తెలుగులో కూడా ఈ సినిమాపై మంచి బజ్ ఏర్పడింది.

  Last Updated: 20 Dec 2024, 12:28 PM IST