Vijay Sethupathi: ఫ్యాన్స్ కు విజయ్ సేతుపతి రిక్వెస్ట్.. అలా పిలవద్దు అంటూ!

పాన్ ఇండియా స్టార్ గా అభివర్ణించడంతో విలక్షణ నటుడు విజయ్ సేతుపతి తీవ్ర అసహనానికి గురికావడం చర్చనీయాంశంగా మారింది. 

Published By: HashtagU Telugu Desk
Vijay Setupathi, slim looks

Vijay Setupathi

తమిళ తెలుగు హిందీ భాషల్లో ప్రస్తుతం వరుస క్రేజీ ప్రాజెక్ట్ లు చేస్తున్న విజయ్ సేతుపతి (Vijay Sethupathi) హీరోగా విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానూ నటిస్తూ తనదైన మార్కు నటనతో ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. వెట్రిమారన్ డైరెక్షన్ లో రూపొందుతున్న ప్యారలల్ మూవీ ‘విడుదలై’లో నటిస్తున్నాడు. అంతే కాకుండా ఇదే ఏడాది గాంధీ టాక్స్ ముంబైకార్ జావాన్ వంటి సినిమాలతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ మూడు సినిమాలు ప్రస్తుతం చిత్రీకరణ దశలో వున్నాయి. ఇక సుందర్ సి. రూపొందిస్తున్న హారర్ థ్రిల్లర్ ‘అరణ్మనై 4’లోనూ విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇలా తమిళ హిందీ (Pan Movies) భాషల్లో ప్రస్తుతం బిజీగా వున్న విజయ్ సేతుపతి తాజాగా అసహనానికి లోనయ్యాడు. తనని ఇంటర్వ్యూ చేస్తున్న వారిపై అసహనాన్ని వ్యక్తం చేశాడు.

వివరాల్లోకి వెళితే.. ఇటీవల ఓ మీడియాకు విజయ్ సేతుపతి (Vijay Sethupathi) ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా తనని పాన్ ఇండియా స్టార్ గా అభివర్ణించడంతో విలక్షణ నటుడు విజయ్ సేతుపతి తీవ్ర అసహనానికి గురికావడం చర్చనీయాంశంగా మారింది. తనని పాన్ ఇండియా స్టార్ గా అభివర్ణిస్తే తనని అలా పిలవొద్దని అసహనాన్ని వ్యక్తం చేశారట. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారి విశేషంగా విజయ్ సేతుపతి అభిమానుల్ని ఆకట్టుకుంటోంది.

ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్ సేతుపతి (Vijay Sethupathi) తనని పాన్ ఇండియా స్టార్ అనొద్దని తాను కేవలం నటుడిని మాత్రమేనని సెలవిచ్చారట. అంతే కాకుండా పాన్ ఇండియా స్టేట్ మెంట్ తో కాస్త ఇబ్బందికరంగా వుంటుందని కొన్ని సార్లు ఆ మాట ఒత్తిడికి కూడా గురి చేస్తుందని మరోసారి చెబుతున్నానేను కేవలం నటుడిని మాత్రమే. దానికి ఎలాంటి లేబుల్ వేయొద్దు అన్నారట. అంతే కాకుండా తనకు అన్ని భాషల్లోనూ సినిమాలు చేయాలని వుందని బెంగాలీ గుజరాత్ ఇలా ఎక్కడ అవకాశం వచ్చిన నటిస్తానని చెప్పుకొచ్చారు.

తెలుగు ప్రేక్షకులకు ‘పిజ్జా’ సినిమాతో విజయ్ సేతుపతి చేరువైన విషయం తెలిసిందే. ఆ తరువాత తెలుగులో నేరుగా ‘సైరా’ ఉప్పెన వంటి సినిమాల్లో నటించారు. విలన్ గా విజయ్ నటించిన ‘మాస్టర్’ (Master) కమల్ హాసన్ నటించిన ‘విక్రమ్’ సినిమాల్లో విజయ్ సేతుపతి నటించిన ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ‘ఉప్పెన’లో నటించిన రాయనం పాత్ర తెలుగులో విజయ్ సేతుపతికి మరింత గుర్తింపుని తెచ్చి పెట్టింది.

Also Read: Chiranjeevi Reveals: పూలు మాత్రమే కాదు.. నాపై గుడ్లు కూడా విసిరారు: చిరంజీవి

  Last Updated: 08 Feb 2023, 05:29 PM IST