కోలీవుడ్ స్టార్ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి (Vijay Sethupathi) ఏ సినిమా చేసినా సరే అది ఒక ప్రత్యేకమైన క్రేజ్ తెచ్చుకుంటుంది. విజయ్ సేతుపతి లేటెస్ట్ సినిమా మహారాజ తెలుగు, తమిళ భాషల్లో రిలీజై సూపర్ హిట్ అందుకుంది. ఆ సినిమా యూనిట్ కూడా ఊహించని విధంగా సినిమా 100 కోట్లు కలెక్షన్స్ సాధించింది. థియేటర్ లో ఈ సినిమా చూసిన వారంతా విజయ్ సేతుపతి యాక్టింగ్ కి ఫిదా అయ్యారు. తెలుగు లో ఈ సినిమాను చూసిన కొందరు దర్శకులు సినిమా తప్పకుండా చూడాలని కోరారు.
ఇక థియేట్రికల్ రన్ పూర్తైన ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కు రెడీ అవుతుంది. సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఓటీటీ ఆడియన్స్ ఎప్పుడు డిజిటల్ రిలీజ్ అవుతుందా అని ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో విజయ్ సేతుపతి మహారాజ (Maharaja) సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ లాక్ అయ్యింది. ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ (Netflix)లో మహారాజ స్ట్రీమింగ్ కానుంది. జూలై 12న ఈ సినిమా ఓటీటీ రిలీజ్ అవుతుంది.
తన ఇమేజ్ కు తగినట్టుగానే విజయ్ సేతుపతి వెరైటీ కథలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. మహారాజ సినిమా తమిళంలోనే కాదు తెలుగులో కూడా విశేష ఆదరణ దక్కించుకుంది. సినిమాను కొన్న తెలుగు డిస్ట్రిబ్యూటర్ కి మంచి లాభాలు వచ్చాయని తెలుస్తుంది. మహారాజ సినిమా థియేటర్ లో మిస్సైన వారు ఓటీటీ రిలీజ్ కోసం ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.
ఈ సినిమాపై ఉన్న బజ్ చూస్తుంటే ఓటీటీ లో కూడా సినిమా ఒక రేంజ్ హిట్ అయ్యేలా ఉంది. మహారాజ సినిమా సక్సెస్ తో విజయ్ సేతుపతి కెరీర్ లో సరికొత్త జోష్ కబడుతుందని చెప్పొచ్చు. నిథిలన్ స్వామినాథన్ (Nithilan Swaminathan) డైరెక్ట్ చేసిన ఈ సినిమా డిజిటల్ ఆడియన్స్ ని ఎంతమేరకు అలరిస్తుంది అన్నది చూడాలి. తెలుగు, తమిళ భాషలతో పాటుగా కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కూడా నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంటుంది.