మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి (Vijay Sethupathi) కోలీవుడ్ లో విలక్షణ నటుడిగా మెప్పిస్తూ వస్తున్నాడు. కేవలం హీరోగానే కాదు ప్రతినాయకుడిగా కూడా తన మార్క్ చాటుతున్నాడు. ఐతే విజయ్ సేతుపతి 50వ సినిమాగా వచ్చిన మహారాజ సూపర్ హిట్ అయ్యింది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ రిజల్ట్ అందుకుంది. సినిమా చూసిన వారంతా థ్రిల్ అయ్యేలా సినిమా ఉంది. నిథిలన్ స్వామినాథన్ డైరెక్షన్ లో తెరకెక్కిన మహారాజ సినిమా తన కూతురికి అన్యాయం చేసిన వారిని పట్టుకునే క్రమంలో చెత్త డబ్బా పోయిందని పోలీస్ కంప్లైంట్ ఇస్తాడు. తీగ లాగితే డొంక కదిలినట్టు క్లైమాక్స్ లో గూస్ బంప్స్ ట్విస్ట్ తో సినిమా ముగుస్తుంది.
ఐతే మహారాజ తెలుగు వెర్షన్ లో కూడా సూపర్ హిట్ కాగా ఈమధ్యనే ఈ సినిమాను చైనాలో భారీగా రిలీజ్ చేశారు. దాదాపు 40 వేల థియేటర్స్ లో మహారాజ (Maharaja) చైనాలో రిలీజైంది. ఐతే అక్కడ కూడా సినిమాకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. సినిమా ఫస్ట్ డే నే 16 కోట్ల దాకా కలెక్షన్స్ రాబట్టింది.
ఇది ఓ విధంగా రికార్డ్ అని చెప్పొచ్చు. చైనా (China)లో కొన్నాళ్లుగా భారతీయ సినిమాలు రిలీజ్ కాలేదు. ఐతే ఈమధ్య చర్చల అనంతరం మళ్లీ ఇండియన్ సినిమాలు అక్కడ రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో విజయ్ సేతుపతి మహారాజ అక్కడ భారీగా రిలీజైంది.
చైనాలో 80 వేలకుపైగా థియేటర్స్ ఉంటే అందులో సగానికి మహారాజ రిలీజైంది. సినిమాకు అక్కడ కూడా సూపర్ హిట్ టాక్ రాగా కచ్చితంగా ఫుల్ రన్ లో మహారాజ రికార్డులు సృష్టిస్తుందని చెప్పొచ్చు.
Also Read : Rashmika Mandanna : పుష్ప 2 కోసం రష్మిక ఎన్ని రోజులు డేట్స్ ఇచ్చిందో తెలుసా..?