Site icon HashtagU Telugu

Vijay Sethupathi Remuneration: షారుఖ్ ఖాన్ తో విజయ్ సేతుపతి.. భారీ రెమ్యూనరేషన్ డిమాండ్

Vijay Setupati

Vijay Setupati

తమిళ్ నటుడు విజయ్ సేతుపతి షారుఖ్ ఖాన్‌తో సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అయితే ఆ సినిమాలో నటించేందుకు రూ. 21 కోట్లు పారితోషికం తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. సాధారణంగా విజయ్‌కి ఒక్కో సినిమాకు రూ. 15 కోట్లు పారితోషికం తీసుకుంటున్నారు. అయితే కీలక పాత్ర పోషించిన ‘విక్రమ్’ విజయంతో విజయ్ సేతుపతి రెమ్యునరేషన్ ఒక్కసారిగా పెరిగింది. విజయ్‌కి తమిళంలోనూ, తెలుగులోనూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

ఒకవైపు హీరోగా రాణిస్తూనే.. మరోవైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మెప్పిస్తున్నాడు.  ఈ నటుడి డేట్స్ కోసం పెద్ద పెద్ద నిర్మాతలు సైతం క్యూ కడుతున్నారు. ఈ బాలీవుడ్ చిత్రంలో అతన్ని నటింపజేయడం ద్వారా దక్షిణాదిన ఫ్లస్ అవుతుంది. షారుక్ ప్రధాన పాత్రలో అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ‘జవాన్’ అనే టైటిల్ పెట్టారు. సక్సెస్ రేటు అనేది స్క్రిప్ట్‌పై ఆధారపడి ఉంటుంది. సరైన కథనం లేకపోతే ఎంత పెద్ద సినిమా అయినా ఫెయిల్ అవుతుంది. విజయ్ సేతుపతి ఎంట్రీతోనైనా షారుఖ్ హిట్ కొడుతాడా? లేదా అనేది వేచిచూడాల్సిందే.