Pawan Kalyan : పవన్ కళ్యాణ్ పొలిటికల్ జర్నీ గురించి విజయ్ సేతుపతి కామెంట్స్..

పవన్ కళ్యాణ్ పొలిటికల్ జర్నీ గురించి విజయ్ సేతుపతి కామెంట్స్. నాకు తెలిసిన తెలుగు వ్యక్తుల వాట్సాప్ స్టేటస్‌ల్లో..

Published By: HashtagU Telugu Desk
Vijay Sethupathi Comments About Pawan Kalyan Political Journey

Vijay Sethupathi Comments About Pawan Kalyan Political Journey

Pawan Kalyan : తెలుగు హీరో పవన్ కళ్యాణ్ పేరు ఇప్పుడు దేశమంతటా వినిపిస్తుంది. ఈ ఎన్నికలతో తాను సినిమాల్లోనే కాదు, పాలిటిక్స్ లో కూడా పవర్ స్టార్ ని అని పవన్ నిరూపించుకున్నారు. ఈ ఎన్నికల్లో పవన్ సృష్టించిన సునామీ.. కేవలం స్టేట్ పాలిటిక్స్ ని మాత్రమే కాదు, సెంట్రల్ పాలిటిక్స్ లో కూడా ప్రధాన పాత్ర పోషించింది. దీంతో ఇండియా వైడ్ పవన్ గురించి ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్నారు.

ఇక తాజాగా తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి.. పవన్ పొలిటికల్ జర్నీ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసారు. విజయ్ సేతుపతి మాట్లాడుతూ.. “పవన్ కళ్యాణ్ గురించి నాకు ఏమి తెలియదు. కానీ నాకు తెలిసిన తెలుగు వ్యక్తుల వాట్సాప్ స్టేటస్ ల్లో నేను ఆయన్ని ఎక్కువగా చూస్తుంటాను. ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ రిజల్ట్ ఏమైందని, నేను వాళ్ళని అడిగే తెలుసుకున్నాను. తోడు కొట్టి ఛాలెంజ్ చేసి గెలిచారు. ఆయన సినిమాల్లోనే కాదు, రియల్ లైఫ్ లో కూడా మాస్ హీరో.

ఆయన నిలకడ, పట్టుదల, హార్డ్ వర్క్‌కి నేను అభిమానిని అయ్యిపోయాను. ఈ పొలిటికల్ జర్నీలో ఆయన పై ఎన్నో ట్రోల్స్ వచ్చాయి. నా పై కూడా కొన్ని ట్రోల్స్ వస్తుంటాయి. అవి చూసి ఎదుర్కొనే మానసిక ధైర్యం మనకి ఎక్కువ ఉండాలి. అలాంటిది, ఆయన పై ఎన్నో ట్రోల్స్ వచ్చాయి. వాటన్నిటికీ ఎదురు నిలబడి నేడు సమాధానం చెప్పారు. అది నాకు బాగా నచ్చింది. ఆయన ఎవరో ఒకరి జీవితంలో హీరో కాదు, ఆయన జీవితంలోనే హీరో” అంటూ కొనియాడారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోని పవన్ అభిమానులు నెట్టింట వైరల్ చేస్తున్నారు.

  Last Updated: 10 Jun 2024, 05:29 PM IST