కొలీవుడ్ హీరో అజిత్(Ajith Padma Bhushan Award)కు కేంద్రం ఇచ్చిన పద్మ భూషణ్ అవార్డుపై విజయ్ ఫ్యాన్స్ ఆగ్రహంవ్యక్తం చేస్తున్నారు. 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వ్యక్తులకు అత్యున్నత పౌర పురస్కారాలు అయిన పద్మ అవార్డులను ప్రకటించింది. 2025 సంవత్సరానికి గానూ, ఈ అవార్డులు ప్రకటించబడిన జాబితాలో అనేక గొప్ప వ్యక్తుల పేర్లు ఉన్నాయి.
Governor Abdul Nazeer : ఏపీ ఆర్థిక పరిస్థితిపై గరవర్నర్ కీలక వ్యాఖ్యలు
ఈ అవార్డులు కళలు, సాహిత్యం, వైద్యం, విద్య, సామాజిక సేవ, సైన్స్, ఇంజనీరింగ్, క్రీడలు, వాణిజ్యం, పరిశ్రమలు, పౌర సేవ వంటి అనేక రంగాలలోని ప్రముఖులకు ఇచ్చి, వారి విశేష కృషిని గుర్తించనున్నారు. పద్మవిభూషణ్ అవార్డుకు 7 గురు. 19 మంది వ్యక్తులకు పద్మభూషణ్ అవార్డు మరియు 113 మందికి పద్మశ్రీ అవార్డులు ప్రకటించారు. ఇక పద్మభూషణ్ అందుకున్న వారిలో తమిళ్ హీరో అజిత్ కూడా ఉన్నారు.
అజిత్ కు పద్మ భూషణ్ రావడం పట్ల ఆయన ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటుంటే.. విజయ్ ఫ్యాన్స్ ఈ అవార్డు వెనుక BJP ప్రభుత్వ హస్తం ఉందని ఆరోపిస్తున్నారు. గతంలో శివాజీ గణేశన్, రజినీకాంత్ లాంటి నటులకు కూడా ఈ తరహా అవార్డులు అప్పటి రాజకీయ పరిస్థితుల ప్రభావం వల్ల మాత్రమే లభించాయని వారు చెపుతున్నారు. ఇప్పుడు కూడా తమిళనాట BJP తమ రాజకీయ ప్రయోజనాల కోసం అజిత్‌కు ఈ అవార్డు ఇచ్చిందని ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఈ అవార్డు పట్ల తమిళనాట చర్చ జరుగుతుంది.
మరోవైపు ఈ అవార్డు రావడం పట్ల అజిత్ ఎమోషనల్ అయ్యారు. పద్మ భూషణ్ పురస్కారానికి ఎంపికవడం గౌరవంగా భావిస్తున్నట్లు తమిళ హీరో అజిత్ తెలిపారు. రాష్ట్రపతి, ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు. ‘ఈ రోజు నా తండ్రి జీవించే ఉంటే బాగుండేది. ఆయన నన్ను చూసి గర్వపడేవారు. నా తల్లి ప్రేమకు, త్యాగాలకు కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నా. నాకు ఈ గుర్తింపు కేవలం వ్యక్తిగత ప్రశంస మాత్రమే కాదని, అనేక మంది సమష్టి కృషి, మద్దతుకు నిదర్శనమని భావిస్తున్నా’ అని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.