VD12: పోలీస్ గెటప్ లో విజయ్ దేవరకొండ, కొత్త సినిమా షురూ!

పీరియాడికల్ మూవీలో విజయ్ దేవరకొండ సరసన శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది.

Published By: HashtagU Telugu Desk
Vijay Devarakonda

Vijay Devarakonda

గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. లెక్కప్రకారం రామ్ చరణ్ చేయాల్సిన సినిమా ఇది. అతడు తప్పుకోవడంతో, ఈ ప్రాజెక్టు విజయ్ దేవరకొండను వరించింది. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. కెరీర్ లో దేవరకొండకు ఇది 12వ చిత్రం. ఈ పీరియాడికల్ మూవీలో విజయ్ దేవరకొండ సరసన శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తోంది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో వస్తున్న ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్, సారథి స్టూడియోస్ మొదలైంది.

జెర్సీతో మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు దర్శకుడు గౌతమ్ తిన్ననూరి. అంతకంటే ముందు మళ్లీ రావా అనే సెన్సిబుల్ సినిమాను తెరకెక్కించాడు. ఇతడికి విజయ్ దేవరకొండ తోడవ్వడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. జెర్సీ సినిమాకు సంగీతం అందించిన అనిరుధ్, ఈ సినిమాకు కూడా మ్యూజిక్ అందిస్తున్నాడు. రెగ్యులర్ షూట్ మొదలైన సందర్భంగా కొత్త పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్ లో పోలీస్ గెటప్ లో గన్ పట్టుకొని విజయ్ చాలా ఇంటెన్స్ గా కనిపిస్తున్నాడు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ స్పైగా కనిపించబోతున్నాడు.

Also Read: IND vs WI: ఈ ఇద్దరి ఆటగాళ్లకి ఈసారైనా అవకాశం ఇస్తారా..?

  Last Updated: 17 Jun 2023, 11:20 AM IST