Vijay Deverakonda : తన తల్లితో విజయ్ దేవరకొండ కాశీ ట్రిప్.. అల్లు అర్జున్ భార్య, ఫ్రెండ్స్ కూడా..

విజయ్ దేవరకొండ కుంభమేళా, కాశీ ట్రిప్ కి సంబంధించిన ఫొటోలు తన సోషల్ మీడియాలో షేర్ చేసాడు.

Published By: HashtagU Telugu Desk
Vijay Deverakonda went to Kashi and Maha Kumbh Mela with his Mother and Allu Arjun Wife Allu Sneha Reddy

Vijay Deverakonda Alluarjun

Vijay Deverakonda : విజయ్ దేవరకొండ ఇటీవల మహాకుంభమేళాలో పాల్గొన్న సంగతి తెలిసిందే. ప్రయాగ్ రాజ్ కి వెళ్లి త్రివేణి సంగమంలో స్నానం ఆచరించాడు. విజయ్, అతని తల్లి కలిసి ప్రయాగ్ రాజ్ లో స్నానం ఆచరించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే తాజాగా విజయ్ దేవరకొండ తన కుంభమేళా ట్రిప్ కి సంబంధించి షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారాయి.

విజయ్ దేవరకొండ కుంభమేళా, కాశీ ట్రిప్ కి సంబంధించిన ఫొటోలు తన సోషల్ మీడియాలో షేర్ చేసాడు. అయితే ఓ ఫొటోలో విజయ్ దేవరకొండ అతని తల్లితో పాటు అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహ రెడ్డి, డైరెక్టర్ వంశీ పైడిపల్లి కూడా ఉన్నారు. మరికొంతమంది విజయ్ ఫ్రెండ్స్ ఉన్నారు. దీంతో విజయ్ తో అల్లు అర్జున్ భార్య కాశీ ట్రిప్ కి వెళ్లడం వీరిద్దరూ ఎప్పుడు ఫ్రెండ్స్ అయ్యారు అంటూ చర్చగా మారింది.

ఇక ఈ ఫోటోలను షేర్ చేసి.. మన మూలాలు, సంప్రదాయాలను కనెక్ట్ చేసే మహా కుంభమేళాలో పాల్గొన్నాను. నా ఫ్రెండ్స్ తో కలిసి జ్ఞాపకాలు పోగు చేసుకున్నాను. మా అమ్మతో కలిసి ప్రార్థించాను. మా గ్యాంగ్ తో కలిసి కాశీకి కూడా వెళ్లి వచ్చాను అని పోస్ట్ చేసారు. దీంతో విజయ్ ఫాన్స్ ఈ ఫోటోలను వైరల్ చేస్తున్నారు.

 

Also Read : Srimukhi : శ్రీముఖి హాట్ & స్పైసి లుక్

  Last Updated: 17 Feb 2025, 07:55 PM IST