Vijay Deverakonda : ఇది కదా క్రేజ్ అంటే.. వైజాగ్‌లో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ హంగామా..

ఇది కదా క్రేజ్ అంటే. వరుస ప్లాప్ ల్లో ఉన్న కూడా విజయ్ ఫ్యాన్‌డమ్ ఏమాత్రం తగ్గడం లేదు. వైజాగ్‌లో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ హంగామా..

Published By: HashtagU Telugu Desk
Vijay Deverakonda Vizag Fans Gave Grand Welcome To Their Hero

Vijay Deverakonda Vizag Fans Gave Grand Welcome To Their Hero

Vijay Deverakonda : గీతగోవిందం సినిమా తరువాత విజయ్ దేవరకొండ నుంచి మళ్ళీ అలాంటి ఒక హిట్ పడలేదు. మధ్యలో టాక్సీవాలా, ఖుషి సినిమాలు పర్వాలేదు అనిపించింది. మిగిలిన సినిమాలు అన్ని బాక్స్ ఆఫీస్ వద్ద భారీగా ఫెయిల్ అయ్యాయి. కానీ విజయ్ క్రేజ్ మాత్రం అసలు తగ్గడం లేదు. ప్లాప్స్ పడుతున్న కొద్దీ విజయ్ క్రేజ్ పెరుగుతూ పోతున్నట్లు అనిపిస్తుంది. అందుకు ఉదాహరణ రీసెంట్ గా వైజాగ్ లో చేసిన విజయ్ ఫ్యాన్స్ హంగామా.

విజయ్ దేవరకొండ ప్రస్తుతం VD12 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ న్యూ షెడ్యూల్ వైజాగ్ లో స్టార్ట్ అయ్యింది. ఇక ఈ షూటింగ్ కోసం విజయ్.. నిన్న రాత్రి వైజాగ్ చేరుకున్నారు. తన అభిమాన హీరోకి వైజాగ్ ఫ్యాన్స్ ఘన స్వాగతం పలికారు. విజయ్ కి స్వాగతం పలికేందుకు వైజాగ్ ఎయిర్ పోర్ట్ కి ఫ్యాన్స్ భారీగా చేరుకున్నారు. అక్కడి నుంచి ర్యాలీతో విజయ్ కి గ్రాండ్ వెల్కమ్ పలికారు.

విజయ్ ఫోటోలు ఉన్న జెండాలు, పూల వర్షం, బైక్ ర్యాలీతో వైజాగ్ ఫ్యాన్స్ విజయ్ ని ఆశ్చర్యపరిచారు. కేవలం విజయ్ ని మాత్రమే కాదు.. ఇతర ఫ్యాన్స్ ని కూడా విజయ్ అభిమానులు సర్‌ప్రైజ్ చేసారు. బ్యాక్ టు బ్యాక్ ప్లాప్ ఎదుర్కొంటున్న విజయ్ కి ఈ రేంజ్ క్రేజ్ లభిస్తుండడంతో అందర్నీ వావ్ అనిపిస్తుంది. కాగా విజయ్ ఫ్యాన్స్ అంతా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చేస్తున్న స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ పై రౌడీ ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.

ఈ సినిమాతో విజయ్ సూపర్ కమ్‌బ్యాక్ ఇస్తారని భావిస్తున్నారు. మరి విజయ్ ఏం చేస్తారో చూడాలి. కాగా మే 9న విజయ్ బర్త్ డే ఉన్న సంగతి తెలిసిందే. ఆ రోజు ఈ మూవీ టైటిల్ ని అనౌన్స్ చేయనున్నారట. అలాగే రవి కిరణ్ కోలా దర్శకత్వంలో చేయబోయే సినిమా నుంచి కాన్సెప్ట్ పోస్టర్, ‘టాక్సీవాలా’ డైరెక్టర్ రాహుల్ తో చేయబోయే సినిమా అనౌన్స్‌మెంట్ కూడా ఉండబోతుందట.

  Last Updated: 06 May 2024, 04:25 PM IST