Vijay Deverakonda : టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో VD12 చేస్తున్న సంగతి తెలిసిందే. స్పై యాక్షన్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రం దాదాపు 100 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. కాగా ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శ్రీలంకలో జరుగుతుంది.
ఈ సినిమా కథ తమిళనాడు మరియు శ్రీలంక నేపథ్యంతో ఉండబోతుందట. ఈక్రమంలోనే ఈ మూవీకి సంబంధించిన షూటింగ్స్ ని తమిళనాడు, శ్రీలంకలో జరపుతున్నారు. కేవలం లొకేషన్స్ ని మాత్రమే కాదు ఆర్టిస్టులను కూడా ఆయా ప్రాంతాలు వారినే తీసుకుంటున్నారట. ఇక ఈ షూటింగ్ లో భాగంగానే VD12 టీం శ్రీలంక చేరుకుంది. లంకకి వెళ్లిన విజయ్ దేవరకొండకి గ్రాండ్ వెల్కమ్ లభించింది. అందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.
#And That’s a Welcome of Our Rowdy boy @TheDeverakonda ❤️🔥 At Srilanka For The Shoot of #VD12 @gowtam19 @SitharaEnts @vamsi84 pic.twitter.com/PPO6fwdzvJ
— @Cult Vdk Fan boy ❤️😊 (@GNayak43763) July 9, 2024
ఇది ఇలా ఉంటే, ఈ సినిమా కథ గురించి ఒక చర్చ జరుగుతుంది. ఈ సినిమా కథంతా తమిళనాడు, శ్రీలంక నేపథ్యంలో జరగబోతుందని, ముఖ్యంగా తమిళియన్స్ బ్యాక్‌డ్రాప్ తో ఉండబోతుందని తెలియడంతో.. ఈ మూవీ 1983 నుంచి 2009 వరకు జరుగుతూ వచ్చిన శ్రీలంక తమిళియన్స్ సివిల్ వార్ నేపథ్యంతో రాబోతోందా అనే సందేహం కలుగుతుంది. మరి దర్శకుడు గౌతమ్ ఏం పాయింట్ తో సినిమాని తెరకెక్కిస్తున్నారో వేచి చూడాలి.
కాగా ఈ మూవీలో హీరోయిన్ గా శ్రీలీలని ఎంపిక చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ సినిమా నుంచి శ్రీలీల తప్పుకున్నట్లు తెలుస్తుంది. ఆ స్థానంలోకి మమితా బైజు వచ్చినట్లు వార్తలు వినిపించాయి. అయితే చిత్ర యూనిట్ మాత్రం.. ఇప్పటివరకు హీరోయిన్ గురించి ఏ క్లారిటీ ఇవ్వలేదు.