టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే కాఫీ విత్ కరణ్ 7 వ ఎపిసోడ్‌లో సందడి చేశారు. అందుకు సంబంధించిన ప్రోమో విడుదలైంది. విడుదల చేసిన కొద్ది గంటల్లోనే ప్రోమో హాట్ టాపిక్ గా మారింది. ఈ ఎపిసోడ్‌లో విజయ్ దేవరకొండ తన సెక్స్ లైఫ్, డేటింగ్ గురించి ఓపెన్ కామెంట్స్ చేశాడు. ఈ షోలో విజయ్ దేవరకొండ సిగ్గుపడుతూ కనిపించాడు. అయితే కరణ్ జోహర్ మాత్రం అనేక ప్రశ్నలు సంధించాడు. నువ్వు ఎప్పుడైనా సెక్స్ చేశావా? చేస్తే ఎక్కడ చేశావ్? అని అడగడంతో ఓ నవ్వు నవ్విన రౌడీ హీరో ఇలా సమాధానమిచ్చాడు. తాను కారులో సెక్స్ చేశానని సిగ్గుపడుతూ చెప్పాడు. అయితే, అనన్య పాండే రియాక్ట్ అవుతూ ‘‘ఈ రోజే చేశాడని’ అని ఫన్నీ ఆన్సర్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ గా మారింది.
ధర్మ ప్రొడక్షన్స్‌తో కలిసి పూరి కనెక్ట్స్ ఈ లైగర్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్, కరణ్ జోహార్ అపూర్వ మెహతా కలిసి ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ అందించగా, థాయ్‌లాండ్‌కు చెందిన కెచా స్టంట్ డైరెక్టర్ గా వ్యవహరించారు. ఇప్పటికే ఎన్నో అంచనాలు రేపుతున్న లైగర్ మూవీ 25 ఆగస్టు 2022న హిందీ, తెలుగు, తమిళం, కన్నడ మలయాళ భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది.
https://twitter.com/karanjohar/status/1551801686049845249?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1551801686049845249%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.pinkvilla.com%2Fentertainment%2Fsouth%2Fvijay-deverakonda-talks-about-last-time-he-had-sex-did-it-public-place-koffee-karan-7-promo-1167630