Site icon HashtagU Telugu

Vijay Deverakonda: లైగర్ కు U/A సర్టిఫికేట్‌.. రన్ టైం ఎంతంటే?

Liger

Liger

విజయ్ దేవరకొండ ‘లైగర్’ మూవీకి సెన్సార్ అధికారులు UA సర్టిఫికేట్‌ను అందించారు. దీంతో సినిమా విడుదలకు రంగం సిద్ధమైంది. సినిమా రన్‌టైమ్ 2 గంటల 20 నిమిషాలు. మొదటి సగం 1 గంట 15 నిమిషాలు కాగా, రెండవ సగం 1 గంట 5 నిమిషాలు. ఈ సినిమాలో ఏడు ఫైట్లు, ఆరు పాటలు ఉన్నాయని ప్రొడక్షన్ హౌస్ వర్గాలు తెలిపాయి. ఇండియా స్టార్ గా విజయ్ దేవరకొండ నటిస్తున్న భారీ అంచనాలున్న ‘లైగర్’ (సాలా క్రాస్‌బ్రీడ్) ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించాడు.

లెజెండరీ బాక్సర్ మైక్ టైసన్ ఈ సినిమాతో భారతీయ చిత్రసీమలోకి అడుగుపెడుతున్నాడు. విజయ్ రియలిస్టిక్ పెర్ఫార్మెన్స్, అద్భుతమైన యాక్షన్, డ్యాన్స్ సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయని అంటున్నారు. విజయ్ దేవరకొండ క్యారెక్టరైజేషన్ తడబడుతో కూడిన డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ ఆకట్టుకున్నాయి. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతోంది.